E-Paper
Advertisement

ముల్కలపల్లిలో జోరుగా మట్టి మాఫియా దందా..!

ముల్కలపల్లిలో జోరుగా మట్టి మాఫియా దందా..!
Advertisement

Soil Mafia: స్వేచ్ఛ బ్యూరో: గద్వాల మండలం ముల్కలపల్లి గ్రామ శివారులో మట్టి మాఫియా బరితెగిస్తోంది. కృష్ణా నది పరివాహక ప్రాంతం నుండి ఎలాంటి అనుమతులు లేకుండా, పట్టపగలే యథేచ్ఛగా మట్టిని తరలిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. కృష్ణా నది తీర ప్రాంతంలో జేసీబీలను ఉపయోగించి భారీ ఎత్తున తవ్వకాలు జరుపుతున్నారు. నిరంతరం టిప్పర్లు, ట్రాక్టర్ల ద్వారా మట్టిని తరలిస్తూ పర్యావరణానికి విఘాతం కలిగిస్తున్నారు.

Also read: మేడ్చల్ సర్కార్ దవాఖానలో దారుణం.. సమయానికి రాని డాక్టర్లు.. రోడ్డుపైనే రోగులు!

చర్యలు ఎక్కడ?

Advertisement

అధికారుల భయం లేకుండా మాఫియా సభ్యులు పట్టపగలే ఈ అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతుండటం గమనార్హం. నదీ పరివాహక ప్రాంతం దెబ్బతినడం వల్ల భూగర్భ జలాలు తగ్గిపోతాయని, అలాగే భారీ వాహనాల రాకపోకలతో స్థానిక రోడ్లు పాడవుతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ అక్రమ మట్టి రవాణాపై రెవెన్యూ మరియు పోలీస్ శాఖ అధికారులు తక్షణమే స్పందించి అక్రమ తవ్వకాలను అరికట్టి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరారు.

Also read: భీంనగర్‌లో సినిమా చూపిస్తున్న అధికారులు.. ఆదర్శమా లేక రాజకీయమా?

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×