E-Paper
Advertisement

పెంపుడు శునకాలకు.. వీధి కుక్కల రక్తం.. డాక్టర్లు చెప్పింది వింటే వణికిపోవాల్సిందే!

పెంపుడు శునకాలకు.. వీధి కుక్కల రక్తం.. డాక్టర్లు చెప్పింది వింటే వణికిపోవాల్సిందే!
Advertisement

Dog Blood: హైదరాబాద్‌లోని షేక్‌పేటలో గల ఒక ప్రైవేట్ పెట్ క్లినిక్‌లో కుక్కల రక్తంతో అక్రమంగా వ్యాపారం చేస్తున్నారనే ఆరోపణలు ఇటీవల తీవ్ర సంచలనం రేపాయి. వీధి కుక్కలను సంరక్షణ పేరుతో తెచ్చి.. వాటి నుంచి రక్తాన్ని సేకరించి భారీ ధరలకు విక్రయిస్తున్నారని ఆరోపణలు వెలువడ్డాయి. ఒక ప్యాకెట్ కుక్క రక్తాన్ని రూ.18,000 నుండి రూ.30,000 వరకు విక్రయించినట్లు కూడా పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే దీనిపై ప్రభుత్వ వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డా. చంద్రశేఖర్ తాజాగా బిగ్ టీవీతో మాట్లాడారు. సంచలన విషయాలను పంచుకున్నారు.

పెట్ డాగ్స్‌కు డేంజర్..

స్ట్రీట్ డాగ్ రక్తాన్ని పెంపుడు కుక్కలకు ఎక్కిస్తే యమా డేంజర్ అని వెటర్నరీ డాక్టర్ చంద్రశేఖర్ స్పష్టం చేశారు. మనుషుల తరహాలోనే కుక్కలకు సైతం 8 రకాల బ్లడ్ గ్రూప్స్ ఉంటాయని తెలిపారు. కాబట్టి స్క్రీనింగ్ లో కుక్కలకు ఉన్నదని ఒకే గ్రూప్ రక్తమని తేలాకే.. బడ్ల్ ఎక్కించాలని సూచించారు. అయితే పెంపుడు శునకానికి మెుదటగా బ్లడ్ ఎక్కిస్తున్నట్లైతే ఏ గ్రూప్ బ్లడ్ అయినా ఇవ్వవచ్చని డా. చంద్రశేఖర్ తెలియజేశారు.

బ్లడ్‌లో ఇన్ఫెక్షన్ ఉంటే..

Advertisement

వీధి కుక్కలకు సంబంధించిన బ్లడ్ ను తీసుకునేటప్పుడు తప్పనిసరిగా స్క్రీనింగ్ చేయాలని డా. చంద్రశేఖర్ మరోమారు పునరుద్ఘటించారు. స్క్రీనింగ్ చేయాలి.. లేదంటే వీధి కుక్కలకు ఉన్న జబ్బులే పెంపుడు శునకాలకు వచ్చే ఛాన్స్ ఉందని హెచ్చరించారు. అది కూడా పెంపుడు శునకాలకు యాక్సిడెంట్ జరిగి రక్తం పోయినప్పుడు, ఏదైనా ఇన్ ఫెక్షన్ ఉన్నప్పుడు మాత్రమే రక్తాన్ని ఎక్కించే ప్రక్రియను చేపట్టాలన తేల్చి చెప్పారు. అసలు వీధి కుక్క నుంచి రక్తం సేకరించడమనేది.. నైతికంగా సరైంది కాదని వెటర్నరీ వైద్యుడు అభిప్రాయపడ్డారు. డోనర్స్ నుంచి మాత్రమే రక్తాన్ని సేకరించాలని సూచించారు.

Also Read: ప్రపంచానికి ‘చమురు సెగ’.. మళ్లీ లాక్‌డౌన్ చీకట్లోకి దేశాలు.. మరి భారత్ సంగతేంటి?

నగరంలో 50 రకాల బ్రీడ్స్

Advertisement

అయితే ఇప్పటివరకూ డాగ్ బ్లడ్ ను డబ్బుకు కొనుగోలు చేసినట్లుగా కచ్చితమైన సమాచారం తన వద్ద లేదని డా. చంద్రశేఖర్ తెలిపారు. సాధారణంగా కుక్కల రక్తాన్ని అమ్ముకోవడం అనేది ఎక్కడా లేదని తేల్చి చెప్పారు. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో 50 రకాల బ్రీడ్స్ కు చెందిన పెంపుడు శునకాలు ఉన్నట్లు వైద్యుడు తెలియజేశారు. పెట్ డాగ్స్ కి సాధారణ జబ్బులకు బ్లడ్ ఎక్కించాల్సిన అవసరం లేదని మరోమారు స్పష్టం చేశారు. ప్రభుత్వ వెటర్నరీ వైద్యులు.. తప్పకుండా పాటించాల్సిన నిబంధనలు ఉన్నాయని అన్నారు.

Also Read: UP Rains: విరుచుకుపడ్డ వర్షాలు.. ఏకంగా 100 మంది మృత్యువాత.. సీఎం తీవ్ర భావోద్వేగం

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×