// // Illegal Constructions: అమీన్‌పూ‌ర్‌లో దర్జాగా అక్రమ కట్టడాలు -->
E-Paper
Advertisement

అమీన్‌పూ‌ర్‌లో దర్జాగా అక్రమ కట్టడాలు.. పట్టించుకోని అధికారులు

అమీన్‌పూ‌ర్‌లో దర్జాగా అక్రమ కట్టడాలు.. పట్టించుకోని అధికారులు
Advertisement

Illegal Constructions: స్వేచ్ఛ బ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అమీన్పూర్ సర్కిల్‌లో భారీగా అక్రమ కట్టడాలు వెలుగుచూస్తున్నాయి. సర్కిల్ జీహెచ్ఎంసీ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ సెక్షన్ అధికారుల విధి నిర్వహణపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి.

అమీన్పూర్ ప్రాంతాల్లో..

ఓవైపు ఆరోపణలు, మరోవైపు విమర్శలు వస్తున్నా అమీన్పూర్ సర్కిల్ అధికారులు మాత్రం స్పందించకపోవడం గమనార్హం. “నాకేం తెలియదు… అంతా గత అధికారుల పాపమే” అన్నట్టుగా బాధ్యత తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత కొద్ది కాలంగా అమీన్పూర్ సర్కిల్ పరిధిలోని కిష్టారెడ్డిపేట, పటేల్ గూడా, అమీన్పూర్ ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలు ఊపందుకున్నాయి. స్థలం తక్కువైనా తగ్గేదేలే అన్నట్టుగా అవినీతి పునాదులపై అదనపు అంతస్తులు నిర్మిస్తున్నారు. అవి అక్రమమని తెలిసినా అధికారులు అడ్డుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది.

Advertisement

Also Read: స్పీడు పెంచిన కల్వకుంట్ల కవిత.. కొత్త పార్టీతో అసలు ప్లాన్ అదేనా..?

అధికారులు మౌనం

సామాన్యులు 100 గజాల స్థలంలో ఇల్లు కట్టుకోవాలంటే అనుమతులు, సెట్బ్యాక్స్ అంటూ ఇబ్బందులు ఎదుర్కొంటుంటే.. పెద్ద బిల్డర్లు మాత్రం ఎలాంటి అనుమతులు లేకుండా బహుళ అంతస్తుల భవనాలు నిర్మిస్తున్నా అధికారులు మౌనం వీడకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ప్రజావాణి ఫిర్యాదులు వచ్చినా చర్యలు తీసుకోకపోవడం, కోర్టు వివాదాలు ఉన్న భూముల్లో కూడా నిర్మాణాలు కొనసాగుతున్నా పట్టించుకోకపోవడం అధికారుల నిర్లక్ష్యాన్ని బట్టబయలు చేస్తోంది. ఈ నేపథ్యంలో అమీన్పూర్ సర్కిల్ పరిధిలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే భవిష్యత్తులో నివాస పరిస్థితులు మరింత దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Also read: డేంజరస్ డేటింగ్ యాప్స్.. క్యూట్ అమ్మాయిలతో వల.. దొరికారో తాట తీసేస్తారు!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×