E-Paper
Advertisement

I Bomma Ravi: ఐబొమ్మ రవి విలాసాల చిట్టా విప్పిన పోలీసులు.. నెదర్లాండ్స్‌లో సర్వర్లు, 20 రోజులకోసారి విదేశీ యాత్ర!

I Bomma Ravi: ఐబొమ్మ రవి విలాసాల చిట్టా విప్పిన పోలీసులు.. నెదర్లాండ్స్‌లో సర్వర్లు, 20 రోజులకోసారి విదేశీ యాత్ర!
Advertisement

I Bomma Ravi: తెలుగు సినిమా పరిశ్రమను కుదిపేసిన ప్రముఖ పైరసీ వెబ్‌సైట్ ‘ఐబొమ్మ’ (iBomma) ప్రధాన నిర్వాహకుడు రవి అరెస్టు తర్వాత విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. శనివారం హైదరాబాద్ క్రైమ్స్ అడిషనల్ సీపీ శ్రీనివాస్ ఈ కేసుకు సంబంధించిన కీలక వివరాలను వెల్లడించారు. విచారణలో రవి పోలీసులకు ఏమాత్రం సహకరించడం లేదని, అధికారుల ప్రశ్నలకు పొంతనలేని సమాధానాలు చెబుతున్నారని సీపీ తెలిపారు. దీంతో పోలీసులు సాంకేతిక ఆధారాలు, ఎథికల్ హ్యాకర్ల సహాయంతో దర్యాప్తును వేగవంతం చేశారు.

ఐబొమ్మ వెబ్‌సైట్ నిర్వహణ అంతా విదేశీ సర్వర్ల నుండే సాగుతోందని పోలీసులు గుర్తించారు. ఎథికల్ హ్యాకర్ల సహాయంతో జరిపిన ప్రాథమిక దర్యాప్తులో, వెబ్‌సైట్ సర్వర్ ఐపీ అడ్రస్‌లు (IP Addresses) నెదర్లాండ్స్ (Netherlands) మరియు ఫ్రాన్స్ (France) దేశాల్లో ఉన్నట్లు తేలింది. ఎన్జీ (NG)ల సహకారంతో ఈ సర్వర్ల పూర్తి వివరాలను, ఐపీలను ఎక్స్‌ట్రాక్ట్ చేసే పనిలో దర్యాప్తు బృందాలు నిమగ్నమై ఉన్నాయి.

Advertisement

పైరసీ ద్వారా రవి భారీగా సంపాదించడమే కాకుండా, అత్యంత విలాసవంతమైన జీవితానికి (Lavish Life) అలవాటు పడ్డాడని పోలీసులు తెలిపారు. రవి ప్రతి 20 రోజులకు ఒకసారి విదేశీ పర్యటనలకు (Foreign Trips) వెళ్లేవాడని, అక్కడే జల్సాలు చేసేవాడని గుర్తించారు. వెబ్‌సైట్ ద్వారా వచ్చే ఆదాయం ఎప్పటికప్పుడు యూఎస్బీటీ (USBT – Crypto) రూపంలో అందేదని, ఆ డబ్బును రవి వెంటనే ఖర్చు చేసేవాడని సీపీ శ్రీనివాస్ వివరించారు. ప్రస్తుతం రవికి సంబంధించిన అన్ని బ్యాంక్ ఖాతాలను సీజ్ చేసి లావాదేవీలను పరిశీలిస్తున్నారు.

ఈ నేరంలో రవికి అతని స్నేహితుడు నిఖిల్ సహకరించినట్లు ఆధారాలు లభించాయి. ఐబొమ్మ వెబ్‌సైట్‌లో కొత్త సినిమాలకు సంబంధించిన పోస్టర్లను నిఖిల్ డిజైన్ చేసి ఇచ్చేవాడు. అంతేకాకుండా, నిఖిల్ ఖాతా నుండి రవి సోదరి (చెల్లి) ఖాతాకు పలుమార్లు నగదు బదిలీలు (Transactions) జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఆర్థిక లావాదేవీల వెనుక ఉన్న ఉద్దేశాన్ని పోలీసులు ఆరా తీస్తున్నారు.

Advertisement

Read Also: Ramanaidu Studios: పన్ను ఎగవేత.. జీహెచ్‌ఎంసీ నోటీసులపై స్పందించిన రామానాయుడు స్టూడియోస్‌

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×