E-Paper
Advertisement

సల్కం చెరువులో ఫాతిమా కాలేజ్.. అధికారులపై హైకోర్టు సీరియస్, నివేదికలు ఇవ్వలంటూ..

సల్కం చెరువులో ఫాతిమా కాలేజ్.. అధికారులపై హైకోర్టు సీరియస్, నివేదికలు ఇవ్వలంటూ..
Advertisement

Salakam Encroachment: హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ఆక్రమణల కూల్చివేతల్లో ‘హైడ్రా’ (HYDRAA) మార్క్ యాక్షన్ అందరికీ తెలిసిందే. ఎక్కడ ఆక్రమణలు ఉన్నా బుల్డోజర్లు దింపేస్తున్న హైడ్రా.. సల్కం చెరువు విషయంలో మాత్రం వెనకడుగు వేస్తోందనే విమర్శలు వస్తున్నాయి. ఈ చెరువును ఆక్రమించి కట్టిన ‘ఫాతిమా కాలేజీ’పై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ వ్యవహారంపై ఒక లాయర్ హైకోర్టును ఆశ్రయించడంతో, ప్రభుత్వ శాఖల అలసత్వం ఇప్పుడు కోర్టు సాక్షిగా బయటపడింది.

అనుమతులపై కోర్టు ప్రశ్నలు

Advertisement

సల్కం చెరువు ఆక్రమణ పిటిషన్‌పై గత ఏప్రిల్ 13, 30 తేదీల్లో హైకోర్టులో విచారణ జరిగింది. కాలేజీ నిర్మాణానికి ఉన్న అనుమతులపై నివేదికలు ఇవ్వాలని కోర్టు వివిధ ప్రభుత్వ శాఖలను ఆదేశించింది. అయితే, మూడు నెలలు గడుస్తున్నా ఏ ఒక్క శాఖ కూడా కోర్టుకు స్పష్టమైన రిపోర్ట్ ఇవ్వకపోవడం గమనార్హం. దీనిపై కోర్టు నిలదీయడంతో ఒక్కో శాఖ వింత సమాధానాలు చెప్పడం మొదలుపెట్టాయి.

ఎవరి సాకు వారిదే!

Advertisement

ఈ కేసులో ప్రధాన శాఖలన్నీ బాధ్యత నుంచి తప్పుకునే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది. మే 15న రెవెన్యూ శాఖతో కలిసి తనిఖీలు చేశామని, వారి నుంచి స్కెచ్ (మ్యాప్) వచ్చాక చర్యలు తీసుకుంటామని చెప్పుకొచ్చింది. తాము ఆ కాలేజీకి ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని చెప్తూనే.. విద్యాశాఖ పూర్తి రిపోర్ట్ ఇవ్వడానికి మరికొంత సమయం కావాలని కోరింది. ఆ చెరువు ‘లేక్ ప్రొటెక్షన్ కమిటీ’ పరిధిలోకి వస్తుందని చెప్పి చేతులు దులుపుకుంది. GHMC ప్రస్తుతం తమకు ‘సర్’ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నందున టైం కావాలని వింత సాకు చెప్పింది. హైడ్రా మిగిలిన శాఖలు డాక్యుమెంట్లు ఇస్తేనే తాము యాక్షన్ తీసుకోగలమని స్పష్టం చేసింది.

హైకోర్టు సీరియస్.. జులై 9న తేలనుందా?

ప్రభుత్వ విభాగాలు ఒకరిపై ఒకరు నెట్టేసుకుంటూ కాలయాపన చేయడంపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. శ్రవణ్ కుమార్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వారం రోజుల్లోగా అన్ని శాఖలు స్పష్టత ఇవ్వాలని, లేకపోతే కోర్టు వైపు నుంచే కఠిన ఆదేశాలు జారీ చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. అనంతరం తదుపరి విచారణను జులై 9కి వాయిదా వేశారు.

కూల్చివేతల విషయంలో దూకుడుగా ఉండే అధికారులు, ఒక కాలేజీకి సంబంధించిన రిపోర్ట్ ఇవ్వడానికి ఎందుకు వెనకాడుతున్నారనేది ఇప్పుడు మిస్టరీగా మారింది. వెనుక ఏవైనా రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరి జులై 9 నాటికైనా ఈ శాఖలు నివేదికలు సమర్పిస్తాయా? లేక కోర్టు ఆగ్రహానికి గురవుతాయా? అనేది చూడాలి.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×