E-Paper
Advertisement

Hyderabad: రూ.13 కోట్ల విలువైన పార్కును కాపాడిన హైడ్రా.. స్థానికులు హర్షం వ్యక్తం

Hyderabad: రూ.13 కోట్ల విలువైన పార్కును కాపాడిన హైడ్రా.. స్థానికులు హర్షం వ్యక్తం
Advertisement

ప్రభుత్వ భూములు, చెరువులు, ప్రజా అవసరాల కోసం కేటాయించిన పార్కు స్థలాలను కబ్జాదారుల నుండి విముక్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న హైడ్రా (HYDRAA), తాజాగా మరో కీలక విజయాన్ని అందుకుంది. రంగారెడ్డి జిల్లా, శేరిలింగంపల్లి మండలం, మదీనాగూడ గ్రామంలో కబ్జాకు గురైన సుమారు 1000 గజాల పార్కు స్థలాన్ని అధికారులు సోమవారం స్వాధీనం చేసుకున్నారు. బహిరంగ మార్కెట్లో ఈ స్థలం విలువ సుమారు రూ. 13 కోట్ల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

మదీనాగూడలోని సర్వే నంబర్ 23లో ‘ఉషోదయ ఎన్‌క్లేవ్’ పేరుతో గతంలోనే హుడా (HUDA) గుర్తింపు పొందిన లేఅవుట్ ఉంది. నిబంధనల ప్రకారం.. ఈ లేఅవుట్‌లో 1000 గజాల స్థలాన్ని పార్కు కోసం కేటాయించారు. దీనికి సంబంధించి గతంలోనే జీహెచ్‌ఎంసీకి గిఫ్ట్ డీడ్ కూడా చేయించారు. అయితే, స్థానికంగా ప్రభావం ఉన్న ఒక వ్యక్తి ఈ స్థలాన్ని అక్రమంగా ఆక్రమించి.. చుట్టూ ప్రీకాస్ట్ గోడలను నిర్మించి తన ఆధీనంలో ఉంచుకున్నారు. తమకు దక్కాల్సిన పార్కు స్థలం కబ్జాకు గురవ్వడంపై ఉషోదయ ఎన్‌క్లేవ్ నివాసితులు గత కొన్నేళ్లుగా సుదీర్ఘ పోరాటం చేస్తున్నారు.

Advertisement

నివాసితులు పలుమార్లు స్థానిక అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో.. చివరకు ప్రజావాణి వేదికగా హైడ్రాకు ఫిర్యాదు అందింది. ఈ ఫిర్యాదుపై తక్షణమే స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాల మేరకు.. రెవెన్యూ, జీహెచ్‌ఎంసీ అధికారులతో కూడిన బృందం క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ చేపట్టింది. లేఅవుట్ ప్లాన్లు, గిఫ్ట్ డీడ్ పత్రాలు, రెవెన్యూ రికార్డులను పరిశీలించగా.. సదరు స్థలం ఖచ్చితంగా పార్కుకు కేటాయించిన ప్రభుత్వ భూమి అని నిర్ధారణ అయ్యింది.

నిర్ధారణ జరిగిన వెంటనే రంగంలోకి దిగిన హైడ్రా సిబ్బంది, సోమవారం భారీ భద్రత నడుమ ఆక్రమణలను తొలగించారు. కబ్జాదారుడు అక్రమంగా నిర్మించిన ప్రీకాస్ట్ ప్రహరీ గోడలను కూల్చివేసి స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు. భవిష్యత్తులో మళ్లీ ఆక్రమణలకు గురికాకుండా ఉండటం కోసం స్థలం చుట్టూ హైడ్రా ప్రత్యేక ఫెన్సింగ్‌ను ఏర్పాటు చేసింది. అంతేకాకుండా.. ‘ఈ స్థలం ప్రజా అవసరాల కోసం కేటాయించబడిన పార్కు స్థలం’ అని స్పష్టం చేస్తూ హెచ్చరిక బోర్డులను కూడా అక్కడ ప్రతిష్టించారు.

Advertisement

ప్రభావవంతమైన వ్యక్తుల చేతుల్లో ఉండి.. ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న ఈ సమస్యను హైడ్రా కేవలం కొన్ని రోజుల్లోనే పరిష్కరించడంపై ఉషోదయ ఎన్‌క్లేవ్ నివాసితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడటంలో హైడ్రా చూపుతున్న తెగువ సామాన్య ప్రజల్లో నమ్మకాన్ని కలిగిస్తోందని స్థానికులు పేర్కొన్నారు. ప్రజా అవసరాల కోసం కేటాయించిన స్థలాలను ఎవరైనా ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా అధికారులు హెచ్చరించారు.

ALSO READ: Holidays: జనవరిలో వరుస సెలవులు.. ప్రయాణాలకు ముందే ప్లాన్ చేసుకోండి.. హాలిడేస్ లిస్ట్ ఇదిగో..

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×