E-Paper
Advertisement

Hydra Gunmen: హైడ్రా గన్ మ్యాన్ ఆత్మహత్యాయత్నం, సర్జరీ పూర్తి.. ఇంకా విషమంగానే ఆరోగ్యం

Hydra Gunmen: హైడ్రా గన్ మ్యాన్ ఆత్మహత్యాయత్నం, సర్జరీ పూర్తి.. ఇంకా విషమంగానే ఆరోగ్యం
Advertisement
Hydra Gunmen:  హైడ్రా గన్‌మెన్ కృష్ణ చైతన్య ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని వైద్యులు వెల్లడించారు. హయత్‌నగర్‌లో జరిగిన ఘటన అనంతరం కృష్ణ చైతన్యను తక్షణమే ఆసుపత్రికి తరలించగా..  డాక్టర్లు అత్యవసర శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. ప్రస్తుతం ఆయనను ఇంటెన్సివ్ న్యూరో క్రిటికల్ కేర్ విభాగంలో ఉంచి చికిత్స అందిస్తున్నారు.  కనీసం 48 గంటలు కఠిన పరిశీలనలో ఉంచాల్సిన అవసరం ఉందని తొలి 24 గంటలు అత్యంత కీలకమని వైద్యులు తెలిపారు.

వైద్య పరీక్షల్లో తలకు సంబంధించిన కీలక భాగం వైపు ప్రభావం పడినట్లు గుర్తించడంతో మూడు గంటల పాటు వైద్య బృందం శ్రమించి శస్త్రచికిత్స నిర్వహించింది. ప్రస్తుతం పరిస్థితి స్థిరపడే వరకు ఏ నిర్ణయానికి రావడం సాధ్యం కాదని వైద్యులు స్పష్టం చేశారు. అవసరమైన అన్ని సహాయక చికిత్సలు అందిస్తున్నామని తెలిపారు.

మరోవైపు ఈ ఘటనకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కుటుంబ సభ్యులు, సహచరులతో మాట్లాడుతూ ఘటనకు దారితీసిన పరిస్థితులను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సంఘటనకు సంబంధించిన అన్ని కోణాలను పరిశీలించి పూర్తి వివరాలు సేకరిస్తామని పోలీసులు తెలిపారు. కృష్ణ చైతన్య ఆరోగ్యంపై ఆసుపత్రి వర్గాలు తరచుగా బులెటిన్లు విడుదల చేస్తామని పేర్కొన్నాయి.

Advertisement

ALSO READ: Elephant Attack: మన్యం జిల్లా రైతులను పరుగులు పెట్టించిన ఏనుగులు.. ఒక్కసారే పదుల సంఖ్యలో..

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×