E-Paper
Advertisement

హైడ్రా ఎట్టి పరిస్థితుల్లోనూ వాటి జోలికెళ్లదు ..?

హైడ్రా ఎట్టి పరిస్థితుల్లోనూ వాటి జోలికెళ్లదు ..?
Advertisement

HYDRAA: స్వేచ్ఛ బ్యూరో: యూఎల్‌సీ(అర్బ‌న్ ల్యాండ్ సీలింగ్‌) భూముల్లోని పాత లే ఔట్ల‌లోని నివాసాలున్నా, ప్లాట్లున్నా హైడ్రా వాటి జోలికెళ్లదని హడ్రా శనివారం విడుదల చేసిన ప్రకటనలో స్పష్టం చేసింది. యూఎల్‌సీ భూముల్లోని పాత లే ఔట్ల‌లో రెగ్యుల‌రైజ్ కాని ఖాళీ ప్లాట్ల‌పై హైడ్రా చ‌ర్య‌లుండ‌వ‌ని క్లారిటీ ఇచ్చింది. యూఎల్‌సీ భూముల్లో వెల‌సిన లే ఔట్ల‌లో ఖాళీగా ఉన్న‌ ప్లాట్ల‌ను హైడ్రా పేరు చెప్పి ఆక్ర‌మించేందుకు ఎవ‌రైనా ప్ర‌య‌త్నిస్తే వాటిని న‌మ్మ‌వ‌ద్ద‌ని న‌గ‌ర ప్రజ‌ల‌ను కోరింది. ఈ విష‌యంలో ఏవైనా సందేహాలుంటే నేరుగా హైడ్రా కార్యాల‌యానికి వ‌చ్చి నివృత్తి చేసుకోవాల‌ని సూచించింది.

హైడ్రా ఏర్ప‌డ‌డానికి..

లే ఔట్ ప్ర‌కారం ర‌హ‌దారులు, పార్కులు, ప్ర‌జావ‌స‌రాల‌కు ఉద్దేశించిన స్థ‌లాలు క‌బ్జా కాకుండా హైడ్రా కాపాడుతుంద‌ని స్ప‌ష్టం చేసింది. హైడ్రా ఏర్ప‌డ‌డానికి (19 జూలై 2024) ముందు నివాసాలుంటే వాటిని కూల్చ‌మ‌ని హైడ్రా ఇప్ప‌టికే చాలాసార్లు స్ప‌ష్టం చేసిన విషయాన్ని గుర్తు చేసింది. ప్ర‌భుత్వ నిర్ణ‌యం మేర‌కు ఇదే విధానాన్ని కొన‌సాగిస్తూ వ‌స్తోందని వెల్లడించింది. ఈ మ‌ధ్య కాలంలో శేరిలింగంప‌ల్లి మండ‌లం కొండాపూర్ గ్రామంలోని ప‌లు యూఎల్‌సీ భూముల్లో వేసిన‌ లే ఔట్ల‌లో పార్కులు, ర‌హ‌దారులు, ప్ర‌జావ‌స‌రాల‌కు ఉద్దేశించిన స్థ‌లాల ఆక్ర‌మ‌ణ‌ల‌ను మాత్ర‌మే హైడ్రా తొల‌గించిందని స్పష్టం చేసింది.

Advertisement

Also read: ఇకపై ఆలయాల్లో అవి ఉండకూడదు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం

కుట్ర‌ కోణం..

కొండాపూర్ గ్రామంలోని రాజ‌రాజేశ్వ‌రిన‌గ‌ర్‌, ఓయూ కాల‌నీ, రాఘ‌వేంద్ర కాల‌నీలోని పార్కులు, ప్ర‌జావ‌స‌రాల‌కు ఉద్దేశించిన స్థ‌లాల‌ ఆక్ర‌మ‌ణ‌లు తొల‌గింపే ఇందుకు నిద‌ర్శ‌నంగా పేర్కొంది. కూక‌ట్‌ప‌ల్లి మండ‌లం హైద‌ర్‌న‌గ‌ర్‌లోని యూఎల్‌సీ భూముల్లో వెల‌సిన గోపాల్‌న‌గ‌ర్ లే ఔట్‌లో పార్కును కూడా ఇదే మాదిరి కాపాడినట్లు పేర్కొంది. యూఎల్ సీ భూముల్లోని లే ఔట్ల‌లో రెగ్యుల‌రైజ్ కాని ప్లాట్ల‌ను హైడ్రా తీసుకుని ప్ర‌భుత్వానికి అప్పగిస్తుందని కొంత‌మంది క‌బ్జాదారులు చేస్తున్న ప్రచారాన్ని న‌మ్మ‌వ‌ద్ద‌ని సూచించింది. మీ ఇంటి స్థ‌లాన్ని త‌క్కువ ధ‌ర‌కు సొంతం చేసుకోవాల‌నే కుట్ర‌ కోణం ఉంద‌నే విష‌యాన్ని గ్ర‌హించాల‌ని కూడా హైడ్రా కోరింది.

Advertisement

Also read: ఎండలో ఎదురుచూపులు.. ఇవి బస్ షెల్టర్లా మందుబాబుల అడ్డాలా..?

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×