E-Paper
Advertisement

Hyderabad: అయ్యప్ప మాల ధరించిన విద్యార్థి.. క్లాస్ రూంలోకి అనుమతించని స్కూల్ యాజమాన్యం

Hyderabad: అయ్యప్ప మాల ధరించిన విద్యార్థి.. క్లాస్ రూంలోకి అనుమతించని స్కూల్ యాజమాన్యం
Advertisement

Hyderabad: అయ్యప్ప మాల ధరించాడని స్కూల్ యాజమాన్యం 6వ తరగతి విద్యార్థిని క్లాస్ రూంలోపలికి అనుమతించలేదు. హైదరాబాద్ జీడిమెట్లలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. మాల వేసుకుంటే ఎందుకు అనుమతించరంటూ స్కూల్ ముందు విద్యార్థి కుటుంబ సభ్యులు, విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగారు. స్కూల్ ను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు.

స్కూల్ వద్ద ఆందోళన

అయ్యప్ప మాల ధరించి స్కూల్ ఎందుకు రాకూడదని విద్యార్థి తల్లిదండ్రులు ప్రశ్నిస్తు్న్నారు. విద్యా్ర్థి సంఘాల నేతలు స్కూల్ లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి కుటుబ సభ్యులు, బంధువులు స్కూలు ముందు బైఠాయించారు. పోలీసులు వారికి సర్దిచెప్పడంతో అక్కడి నుంచి వెళ్లారు.

Advertisement

విజయవాడలో ఇలాంటి ఘటనే

ఏపీలోని విజయవాడలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. భవానీపురం ఆర్టీసీ వర్క్‌షాప్ రోడ్డులోని ఓ ప్రైవేట్ స్కూల్ లో వివాదం నెలకొంది. 3, 5వ తరగతులు చదువుతున్న ఇద్దరు విద్యార్థులు అయ్యప్ప స్వామి మాల ధరించి స్కూలుకు వచ్చారు. స్కూల్ యాజమాన్యం వారిని లోపలికి అనుమతించలేదు. మాల వేసుకుని పాఠశాలకు రాకూడదని యాజమాన్యం వారిని అడ్డుకుంది. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థులు తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకుని ప్రిన్సిపాల్ ప్రశ్నించారు. ప్రిన్సిపాల్ వారితో దురుసుగా ప్రవర్తించడంతో.. స్థానిక అయ్యప్ప స్వాములు, భక్తులు పెద్ద సంఖ్యలో పాఠశాల వద్దకు చేరుకుని ఆందోళన చేశారు. స్వామి మాల వేసుకుంటే స్కూల్ లోపలికి అనుమతించమని ప్రిన్సిపాల్ చెప్పడంతో.. స్వాములకు, ప్రిన్సిపాల్‌కు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.

Advertisement

Also Read: Warangal Floods: మొంథా తుఫాన్ ఎఫెక్ట్.. వరంగల్ అతలాకుతలం

పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు కల్పించుకుని సర్దిచెప్పారు. స్కూల్ యాజమాన్యం తమ నిర్ణయంపై పునరాలోచన చేసేందుకు మూడు రోజుల సమయం ఇచ్చింది. ఈ ఘటనపై డీఈఓకి లేఖ రాశామని, అక్కడి నుంచి రిప్లై వస్తే విద్యార్థులు మాలలో స్కూల్ కు రావడానికి అనుమతించాలా? వద్దా? అనే విషయాన్ని నిర్ణయం తీసుకుంటామని పాఠశాల యాజమాన్యం పోలీసులకు తెలిపింది. పోలీసుల హామీ మేరకు అయ్యప్ప స్వాములు ఆందోళన విరమించారు.

 

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×