E-Paper
Advertisement

Hyderabad: బీజేపీ ఆఫీసులో బ్రేక్ ఫాస్ట్ కబుర్లు.. అధ్యక్షుడితోపాటు నేతలంతా ఆ వ్యవహారం గురించే

Hyderabad: బీజేపీ ఆఫీసులో బ్రేక్ ఫాస్ట్ కబుర్లు.. అధ్యక్షుడితోపాటు నేతలంతా ఆ వ్యవహారం గురించే
Advertisement

Hyderabad: తెలంగాణ బీజేపీ ఆఫీసులో బ్రేక్ ఫాస్ట్ పేరిట సమావేశం నిర్వహించారు అధ్యక్షుడు రాం చందర్‌రావు. ఆ సమావేశంలో వివిధ అంశాలపై ప్రధానంగా చర్చించారు. ముఖ్యంగా తెలంగాణ వ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, ఏ విధంగా ప్రజల ముందుకు వెళ్లాలి, ప్రస్తుత రాజకీయాల గురించి నేతల గురించారు.

బీజేపీ ఆఫీసులో బ్రేక్ ఫాస్ట్ కబుర్లు

Advertisement

శుక్రవారం ఉదయం తెలంగాణ బీజేపీ కార్యాలయంలో బ్రేక్ ఫాస్ట్ పేరిట సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు కీలక నేతలు హాజరయ్యారు. ముఖ్యంగా తెలంగాణలో రైతుల సమస్యల గురించి ప్రధానంగా ప్రస్తావించారు. ఆరు కాలం పండించిన పంటలను రైతులు అమ్ముకోలేక పోతున్నారని, దీనిపై ప్రజల్లోకి వెళ్లాలని ఆ పార్టీ నేతలు డిసైడ్ అయ్యారు.

‘రైతు ఘోష-బీజేపీ భరోసా’ పేరుతో సోమవారం నుండి ప్రజలోకి వెళ్లనున్నారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలని ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ‌లు, జిల్లాల నేతలు విజిట్ చేయనున్నారు. తొలిరోజు నేతలతో కలిసి రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్‌రావు వివిధ కేంద్రాలను సందర్శించనున్నారు. అక్కడ రైతుల సమస్యలను అడిగి తెలుసుకుంటారు.

Advertisement

అధ్యక్షుడితోపాటు నేతలంతా ఆ వ్యవహారం గురించే

ఈ సందర్భంగా బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులను ప్రభుత్వం కంట తడి పెట్టిస్తోందని అన్నారు. ఆరు కాలం పండించిన పంటని అమ్ముకోలేక పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జొన్నల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదని చెప్పారు.

10 పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంతోపాటు ప్రతీ గింజ కొనుగోలు చేస్తామని చెప్పారని గుర్తు చేశారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని మండిపడ్డారు. ధాన్యం 80 శాతం కొనుగోలు చేశామని సీఎం రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలు చెబుతున్నారని, ఇప్పటివరకు కేవలం 24 శాతం మాత్రమే కొనుగోలు జరిగిందన్నారు.

ALSO READ: బండి సంజయ్‌పై కేటీఆర్ కామెంట్స్.. ఆ పంచాయితీ లేదు, కాక్రోచ్ పార్టీ గురించి కూడా

మీరు ఎక్కడికైనా తీసుకెళ్లి చూపించండి మేము వస్తామని, మాతో ముఖ్యమంత్రి వస్తారా అంటూ ప్రశ్నించారు. సీఎం రేవంత్‌రెడ్డి తప్పుడు లెక్కలు చెపుతున్నారని, తాము కొనుగోలు కేంద్రాలను సందర్శిస్తామని చెప్పకనే చెప్పారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×