E-Paper
Advertisement

Hyderabad: డిప్రెషన్‌లో హైదరాబాద్ యువతి.. అమెరికాలో ఆకలిరాజ్యం..

Hyderabad: డిప్రెషన్‌లో హైదరాబాద్ యువతి.. అమెరికాలో ఆకలిరాజ్యం..
Advertisement
hyderabad women

Hyderabad: ఉన్నత చదువుల కోసం అగ్రరాజ్యం వెళ్లింది. కానీ అక్కడ జరిగిన ఓ ఘటన.. తనను డిప్రెషన్‌కు గురయ్యేలా చేసింది. దిక్కుతోచని స్థితిలో చికాగో రోడ్లపై ఆమె ఆకలితో అలమటిస్తూ తిరుగుతోంది. ఇది అమెరికాలో ఉంటున్న హైదరాబాద్‌ యువతి గాథ. కుమార్తె పరిస్థితి తెలుసుకున్న యువతి తల్లి.. విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్‌కు లేఖ రాశారు. తన కుమార్తెను భారత్‌కు రప్పించాలని లేఖలో విజ్ఞప్తి చేశారు.

హైదరాబాద్‌ మౌలాలికి చెందిన సయ్యదా లులు మిన్హాజ్ జైదీ.. డెట్రాయిట్‌లోని ట్రినీ వర్శిటీలో మాస్టర్స్‌ చేసేందుకు 2021లో అమెరికా వెళ్లింది. వెళ్లినప్పటి నుంచి మిన్హాజ్‌.. రోజూ తమతో మాట్లేదని యువతి తల్లి తెలిపింది. కానీ 2 నెలలుగా ఆమె నుంచి ఎలాంటి ఫోన్‌ రాలేదని వాపోయింది. కుమార్తె వస్తువులు ఎవరో అపహరించారని.. దానివల్ల డిప్రెషన్‌లోకి వెళ్లిపోయిందని అక్కడ ఉండే హైదరాబాద్‌ యువకులు చెప్పినట్లు తెలిపింది. బిక్కుబిక్కుమంటూ ఆకలితో రోడ్లపై తిరుగుతున్నట్లు చెప్పారని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయాలన్నింటినీ లేఖలో వెల్లడించింది. వాషింగ్టన్ DCలోని భారత రాయబార కార్యాలయం, చికాగోలోని భారత కాన్సులేట్ జోక్యం చేసుకుని తన కుమార్తెను తిరిగి తీసుకురావాలని లేఖలో వేడుకుంది ఆ తల్లి.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×