E-Paper
Advertisement

Hyderabad Rain Alert: హైదరాబాద్‌కు రెడ్ అలర్ట్.. భారీ ఉరుములు, వడగళ్ల వానలు !

Hyderabad Rain Alert: హైదరాబాద్‌కు రెడ్ అలర్ట్.. భారీ ఉరుములు, వడగళ్ల వానలు !
Advertisement

Hyderabad Rain Alert: హైదరాబాద్ నగరవాసులకు వాతావరణ శాఖ అత్యంత కీలకమైన తీవ్ర ఉరుములతో కూడిన వర్షం హెచ్చరికను జారీ చేసింది. గత ఏడు రోజులుగా భానుడి భగభగలతో ఉడికిపోతున్న నగరంలో, వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. వాతావరణ పీడనంలో ఏర్పడిన మార్పుల వల్ల ప్రెజర్ కుక్కర్ పరిస్థితి ఏర్పడిందని, అది ఇప్పుడు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలుగా మార‌నుంద‌ని అధికారులు హెచ్చరిస్తున్నారు. హైద‌రాబాద్ లో పలు ప్రాంతాల్లో ఇప్ప‌టికే వ‌ర్షం మొద‌లైంది.

రానున్న గంట వ్యవధిలో కుత్బుల్లాపూర్, గాజులరామారం, అల్వాల్, కాప్రా, మల్కాజిగిరి, సికింద్రాబాద్, నాచారం, దమ్మాయిగూడ, చర్లపల్లి, బొల్లారం, ఎల్బీ నగర్, హయాత్‌నగర్, బీఎన్ రెడ్డి నగర్ వంటి ప్రాంతాల్లో అత్యంత తీవ్రమైన ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడనుంది. ఈ తుపాను మేఘాలు క్రమంగా నగరం మధ్యభాగం, దక్షిణ హైదరాబాద్ ప్రాంతాలకు కూడా విస్తరించనున్నాయి. కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వాన కురిసే అవకాశం కూడా ఉంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

Advertisement

నగరంతో పాటు తెలంగాణ గ్రామీణ జిల్లాలకు కూడా భారీ వర్ష సూచన ఉంది. ప్రస్తుతం సిరిసిల్ల, కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇవి మరో రెండు గంటల పాటు కొనసాగి, ఆ తర్వాత సిద్దిపేట, కరీంనగర్, మెదక్ జిల్లాలకు విస్తరించనున్నాయి. అలాగే రంగారెడ్డి, వికారాబాద్, నాగర్ కర్నూల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లో చెదురుమదురుగా వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Read Also: గుడ్ న్యూస్.. సామాన్య గిరిజనులకు తెలంగాణ సర్కార్ భారీ కానుక..?

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×