E-Paper
Advertisement

Water Supply Disruption: అలర్ట్.. హైదరాబాద్‌లోని ఈ ఏరియాల్లో.. 8,9 తేదీల్లో నీటి సరఫరా బంద్!

Water Supply Disruption: అలర్ట్.. హైదరాబాద్‌లోని ఈ ఏరియాల్లో.. 8,9 తేదీల్లో నీటి సరఫరా బంద్!
Advertisement

Water Supply Disruption: హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. 18 గంటల పాటు నీటి సరఫరా అంతరాయం ఏర్పడనుంది. ఫేజ్ 3 ప్రధాన పైప్‌లైన్‌లో అత్యవసర మరమ్మతులు , నిర్వహణ పనులు చేపట్టనున్న నేపథ్యంలో నీటిసరఫరా నిలిచిపోనుంది.

జనవరి 8 ఉదయం 10 గంటల నుంచి జనవరి 9 తెల్లవారుజాము 4 గంటల వరకు ఈ అంతరాయం కొనసాగుతుందని జలమండలి అధికారులు ప్రకటించారు.

Advertisement

ఈ మరమ్మతుల ప్రభావం నగరంలోని పలు ప్రాంతాలపై ప్రభావం చూపనుంది. ముఖ్యంగా మలేసియన్ టౌన్‌షిప్, మాధాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి పరిసరాలు, ఐఎస్బీ ప్రాంతం, భారత్‌నగర్, మూసాపేట్, గాయత్రినగర్, బాలానగర్, కేపీహెచ్‌బీ, బాలాజీనగర్, ఫతేనగర్, గోపాల్‌నగర్, హఫీజ్‌పేట్, మయూరినగర్, మియాపూర్, ప్రగతినగర్, మైటాస్, భెల్, బీహెచ్ఈఎల్, రైల్‌విహార్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, చందానగర్ వంటి అనేక ప్రాంతాల్లో నీరు అందుబాటులో ఉండదని అధికారులు స్పష్టం చేశారు.

ఫేజ్–3 పైప్‌లైన్ ద్వారా రోజుకు లక్షల లీటర్ల నీరు తరలుతుండగా, ఏ చిన్న లీక్ అయినా భారీ నష్టానికి దారి తీసే ప్రమాదం ఉంటుంది. అందుకే మెయిన్ పైప్‌లైన్‌లోని జాయింట్లు, వాల్వులు, పంపింగ్ స్టేషన్లను ఒకేసారి మెయింటెనెన్స్ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

Advertisement

Also Read: కాస్ట్‌లీ బాటిల్స్‌లో చీప్ లిక్కర్.. కల్తీ మద్యం మిక్సింగ్ ముఠా గుట్టురట్టు

ఈ క్రమంలో అధికారులు ప్రజలకు పలు సూచనలు జారీ చేశారు. నివాసితులు అవసరమైన నీటిని ఒక రోజు ముందుగానే నిల్వ చేసుకోవాలని, తాగునీటిని వృథా చేయొద్దని కోరారు. అపార్ట్‌మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీల్లో ట్యాంకర్లను ముందుగానే బుక్ చేసుకోవాలని సూచించారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×