E-Paper
Advertisement

HMWSSB: బిగ్ అలర్ట్.. హైద‌రాబాద్ న‌గ‌రానికి రెండు రోజులు నీటి స‌ర‌ఫ‌రా బంద్..!

HMWSSB: బిగ్ అలర్ట్.. హైద‌రాబాద్ న‌గ‌రానికి రెండు రోజులు నీటి స‌ర‌ఫ‌రా బంద్..!
Advertisement

HMWSSB: హైద‌రాబాద్ న‌గ‌రానికి తాగునీరు స‌ర‌ఫ‌రా చేసే మంజీరా ఫేజ్-3, పెద్దాపూర్ పంప్ లోని పంప్ హౌజ్ లో 35 సంవత్సరాలకు పైగా పాతబడిన హెచ్‌టి (హై టెన్షన్) ఎలక్ట్రికల్ ప్యానెల్స్‌ను తొలగించి, వాటి స్థానంలో కొత్త ప్యానెల్స్‌ను ఏర్పాటు చేయనున్న పనుల కారణంగా ఈ నెల 7, 8వ తేదీల్లోని సుమారు 36 గంటల పాటు పలు ప్రాంతాల్లోని నీటి సరఫరాలో అంతరాయమేర్పడే అవకాశముందని జలమండలి అధికారులు వెల్లడించారు.

లో ప్రెజ‌ర్ తో నీటిస‌ర‌ఫ‌రా..

ప్యానల్ మార్పు పనులతో పాటు పెద్దాపూర్ నుంచి సింగాపూర్ వరకు ఉన్న 1600 మిమీ డయా పంపింగ్ మెయిన్ పైప్‌లైన్‌లోని ఎయిర్ వాల్వ్‌లను, సింగాపూర్ నుంచి పెద్దాపూర్ వరకు ఉన్న 2000 మిమీ డయా గ్రావిటీ మెయిన్ పైప్‌లైన్‌లోని ఎయిర్ వెంట్స్‌ను మార్పిడి చేస్తూ మరమ్మతు పనులు కూడా చేపడుతున్నట్లు జలమండలి వెల్లడించింది. ఈ పనుల కారణంగా 7వ తేదీ శనివారం ఉద‌యం 8 గంట‌ల‌ నుంచి మ‌రుస‌టి రోజు అంటే 8వ తేదీ అదివారం రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు పనులు జరిగే అవకాశాలున్నందున ఈ 36 గంట‌లు కింద పేర్కొన్న కొన్ని ప్రాంతాల్లో లో ప్రెజ‌ర్ తో నీటిస‌ర‌ఫ‌రా, మ‌రికొన్ని ప్రాంతాల్లో స‌ర‌ఫ‌రాలో అంత‌రాయం కలిగే అవకాశాలున్నట్లు వెల్లడించింది.

Advertisement

Also Read: Telangana: సమస్య ఏదైనా స్పాట్‌లోనే పరిష్కారం.. సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ సర్కార్..!

అంత‌రాయం ఏర్ప‌డే ప్రాంతాలు

జలమండలి ఆపరేషన్, మెయింటనెన్స్ డివిజన్-3లోని షేక్‌పేట్ రిజర్వాయర్‌కు నీటి సరఫరా పూర్తిగా నిలిపివేయబడుతుందని జలమండలి వెల్లడించింది. భోజగుట్ట ప్రాంతానికి తక్కువ ప్రెషర్ తో నీటి సరఫరా ఉంటుందని వెల్లడించింది. ఆపరేషన్, మెయింటనెన్స్ డివిజన్-18 పరిధిలోని మణికొండ, కోకాపేట్, నర్సింగి, మంచిరేవుల తదితర ప్రాంతాలకు నీటి సరఫరా ఉండదని జలమండలి స్పష్టం చేసింది. ట్రాన్స్‌మిషన్-1, 2 పరిధిలో నీటి సరఫరాను పూర్తిగా నిలిపివేయనున్నట్లు అధికారులు తెలిపారు. పనుల కారణంగా ఏర్పడే అంతరాయాన్ని గుర్తించి, పైన పేర్కొన్న ప్రాంతాల వినియోగ‌దారులు నీటిని పొదుపుగా వాడుకోవాలని జలమండలి కోరింది.

Advertisement

Also Read: Gundeninda Gudigantalu Balu : భార్యతో బాలు విడాకులు అందుకే తీసుకున్నాడా..? ఇన్నాళ్లకు బయటపడ్డ నిజం..

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×