E-Paper
Advertisement

Hayathnagar: ప్రయాణికుల ప్రాణాలకు భరోసా ఏదీ.. లబోదిబో మంటున్న ఆ ప్రాంత ప్రజలు..?

Hayathnagar: ప్రయాణికుల ప్రాణాలకు భరోసా ఏదీ.. లబోదిబో మంటున్న ఆ ప్రాంత ప్రజలు..?
Advertisement

Hayathnagar: నిత్యం ప్రమాదాల వలయంలో ప్రజలు
–హైదరాబాద్​–విజయవాడ జాతీయ రహదారి విస్తీర్ణంలో కష్టాలు
–సర్వీస్​ రోడ్డులో నిలిపే పార్కింగ్​ వాహనాలతో ప్రమాదాలు
–సుమారుగా 10 కీమీ మేరకు ప్రయాణికులు నరకయాతన
రంగారెడ్డి బ్యూరో, స్వేచ్ఛ:
రోడ్డు విస్తీర్ణతో ప్రయాణికులకు వెసులబాటు అవుతుందని ప్రజలు సంతోషిస్తారు. కానీ హైదరాబాద్​–విజయవాడ జాతీయ రహదారి విస్తీర్ణంతో నగరవాసులు లబోదిబోమంటున్నారు. నాలుగేండ్లుగా ఈ జాతీయ రహదారి పక్కనుంటున్న కాలనీల వాసులు, స్ధానికులు జాతీయ రహదారి విస్తీర్ణం తమ ప్రాణాలమీదకు తీసుకొచ్చిందని ఆవేధన వ్యక్త చేస్తున్నారు. జాతీయ రహదారికి ఇరువైపులున్న కాలనీ వాసులు సర్వీస్​ రోడ్డులోనే వచ్చిపోవడం జరుగుతుంది. అదే రోడ్డులో లారీలు, ట్రక్కులు పార్కింగ్​ చేయడంతో వచ్చిపోయే వాహనాలతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రతి రోజు పది కీలోమీటర్ల ప్రయాణం చేయడం కష్టంగా మారిపోతుందని ప్రజలు వివరిస్తున్నారు. ఈ ప్రమాదాలకు భరోసా ఇచ్చేందుకు అధికారులు, ప్రజాప్రతినినధులు చర్యలు తీసుకోవడం లేదని ప్రచారం సాగుతుంది.

ఈ సమస్యకు పరిష్కార మార్గమేది..?

ఎల్బీనగర్​ నియోజకవర్గ పరిధిలోని చింతలకుంట చెక్​ ఫోస్ట్ నుంచి హయత్​నగర్లోని వర్డ్​ ఆండ్​ డీడ్​ స్కూల్​ వరకు విస్తీరించిన రహదారితో కాలనీ వాసులు ఇబ్బందులు పడుతున్నారు. కుడి వైపు ఉన్న వాళ్లు ఎడమ వైపు వెళ్లేందుకు కాలనీ వాసులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సర్వీస్​ రోడ్డు కూడా పూర్తి స్ధాయిలో నిర్మాణం చేయకపోవడంతో రాకపోకలు ట్రఫిక్​ రూల్స్​కు విరుద్దంగా కనిపిస్తున్నాయి. చింతల కుంట చెక్​ ఫోస్​ట్ నుంచి వర్డ్​ ఆండ్​ డిడ్​ స్కూల్ వరకు సుమారుగా 10కీ.మీ ఉంది. ఈ దూరం ప్రయాణించే వాళ్లు సుమారుగా రెండు కీలోమీటర్ల మేర ఒకే రోడ్డులో ఎదురెదురుగా వెళ్లాల్సి వస్తుంది. కుడి నుంచి ఎడవ వైపు వెళ్లేందుకు ప్రయాణికులు ప్రమాదాలకు గురైతున్నారు. కనీసం ఫుట్​ వేర్​ బ్రీడ్జిలను కూడా నిర్మించలేకపోయారు.ఈ జాతీయ రహదారి రోడ్డు విస్తీర్ణంలో నిర్మించాల్సిన ప్లైఓర్​ బ్రిడ్జీలను నిర్మించకపోవడంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయని స్ధానికులు ఆరోపిస్తున్నారు.

Advertisement

Also Read: Mr. Work From Home: భీమిలిలో సినిమా సందడి..ఘనంగా జరిగిన మిస్టర్ వర్క్ ఫ్రం హోమ్ ప్రీ రిలీజ్ వేడుక

ప్రభుత్వ సంస్థలున్నా పట్టించుకోని అధికారులు..

హయత్​నగర్​ మండల పరిధిలోనున్న కోర్టు, ఆర్టీసీ డిపో, విద్యుత్ సబ్​ స్టేషన్లు ఉన్న ప్రాంతంలోని రాకపోకల సమస్యకు పరిష్కారం లేదు. జాతీయ రహదారి నుంచి ఈ సంస్ధలు సుమారుగా 500 మీటర్ల దూరంలోనే ఉన్నాయి. ఆ సంస్థలకు వెళ్లే మార్గం పూర్తిగా ఇరుకుగానే ఉంది. బస్​ డిపోల నుంచి బస్సుల రాకపోకలతో ప్రజలు నిత్యం ఇబ్బందులు పడుతున్నారు. వందల సంఖ్యలోని ప్రజలు పరిసర ప్రాంతాల్లోనున్న కాలనీవాసులు రహదారిపైకి రావాల్సి వస్తుంది. వీరందరూ రోడ్డెక్కేందుకు ప్రాణాలు అరచేతిలో పెట్టుకోని బయటికి వచ్చే పరిస్థితి ఉంది. డిపోకు వెళ్లే దారిలోనున్న ఓ ఆసుపత్రి రోడ్డును కబ్జా చేసినప్పటికి అధికారులు మౌనం వహించడం విశేషం. ఒపక్క జాతీయ రహదారి విస్తీర్ణంతో సర్వీస్​ రోడ్డులో ప్రైవేట్​ వాహనాలు పార్కింగ్ చేయడంతో బస్సలు లోపలికి, బయటికి వెళ్లేందుకు డ్రైవర్లు ఇబ్బందులు పడుతున్నారు. మరో పక్క ఆ ఆసుపత్రి రోడ్డును కబ్జా చేయడంతో ఒక వాహనం పోతేగానీ మరోక వాహనం వచ్చే పరిస్థితి లేదు. రెండు వాహనాల రాకపోకలు ఆదారి వెంట పోయే పరిస్థితి లేదు. ఈ సమస్య కూడా రహదారి ప్రారంభంలోనే ఉంది.

ప్రమాదాలకు చెక్​ పెట్టాల్సిందే..

Advertisement

రాకపోకలతో ప్రయాణికులు నిత్యం ప్రమాదాలకు గురైతున్నారు. ఈవిషయం స్ధానిక పోలీస్ స్టేషన్ల పరిధిలోని వనస్థలిపురం, హయత్​నగర్​ పోలీస్ అధికారులు తెలుస్తోంది. ఆ సర్వీస్ రోడ్డులో ఇష్టానుసారంగా వాహనాలు నిలిపివేయడంతో రాకపోకలకు ఇబ్బంది పడుతున్నారు. రోడ్డుకు ఇరువైపుల పెట్టే వాహనాలను నివారించినప్పుడే ప్రమాదాలకు చెక్ పెట్టాల్సి వస్తుంది. అంతేకాకుండా ప్లే ఓవర్​, అండర్​పాస్​ రహదారులు ఏర్పాటు చేయాలని స్ధానికులు వివరిస్తున్నారు.చింతల కుంట సమీపంలోని ఈశ్వరమ్మ మడిగెల వద్ద, రాఘవేంద్ర హోటల్, బజాజ్​ ఎలక్ట్రికల్​, వనస్థలిపురంలోని సహార రోడ్డు, పనామా గోడన్స్​, ఆరోనగర్​, ద్వారకనగర్​, బాగ్యలత, ఆర్టీసీ డీపో, లెక్చరర్స్​ కాలనీ, డీర్​పార్క్​, ఆర్టీసీ కాలనీలు ఈ విధంగా అనేక కాలనీల ప్రజలు నిత్యం ఇబ్బందులు పడుతున్నారు. ఈ కాలనీల ప్రజలు రోడ్డుకు ఇరువైపుల రాకపోకలు చేసేందుకు ప్రాణమీదకు తీసుకోస్తున్నారు. ఈ సమస్యలకు పరిష్కారం చేయాలని స్ధానిక ప్రజలు వెడుకుంటున్నారు.

Also Read: Spicy Paneer Rara: బోర్ కొట్టే పన్నీర్ కూరలకు గుడ్ బై.. ఈ కొత్త రకం పన్నీర్ రారా ట్రై చేయండి!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×