E-Paper
Advertisement

Sugarcane Juice Offer: భలే ఆఫర్.. రూ.25కే లీటర్ చెరకు రసం, ఎక్కడో కాదు హైదరాబాద్‌లోనే!

Sugarcane Juice Offer: భలే ఆఫర్.. రూ.25కే లీటర్ చెరకు రసం, ఎక్కడో కాదు హైదరాబాద్‌లోనే!
Advertisement

Sugarcane Juice Offer: ఎండలు మండిపోతున్నాయి. భానుడి భగభగలకు జనం అల్లాడిపోతున్నారు. వేసవి మొదలైందంటే చాలు మనకు విపరీతమైన దాహం వేస్తుంది. గొంతు తడుపుకోవడానికి ఎక్కడ చల్లని పానీయం దొరుకుతుందా అని కళ్లు వెతుకుతుంటాయి. ఈ క్రమంలోనే మనకు రోడ్ల పక్కన కనిపించే అమృతం ‘చెరుకు రసం’. ఒక్క గ్లాస్ తాగితే చాలు, శరీరానికి ఎక్కడ లేని శక్తి వచ్చేస్తుంది. అయితే, ఇప్పుడు హైదరాబాద్‌లోని ఓ ప్రాంతంలో చెరుకు రసం కోసం జనం క్యూ కడుతున్నారు. దానికి కారణం అక్కడ లీటర్ చెరుకు రసం కేవలం రూ. 25లకే లభిస్తుండటమే! అవును మీరు విన్నది నిజమే..

సాధారణంగా బయట ఒక చిన్న గ్లాసు చెరుకు రసమే 20 నుండి 30 రూపాయలు పలుకుతోంది. కానీ, ఎల్బీ నగర్ పరిధిలోని బి.ఎన్. రెడ్డి నగర్, జెడ్పీ రోడ్డులో ఉన్న కిసాన్ మార్కెట్ వద్ద ఈ అద్భుతమైన ఆఫర్ అందుబాటులో ఉంది. కేవలం 25 రూపాయలకే లీటర్ రసాన్ని అందిస్తుండటంతో స్థానికులు ఎగబడుతున్నారు. మీరు సొంతంగా బాటిల్ తీసుకెళ్తే రూ. 25 మాత్రమే. అదే ఒకవేళ వారే బాటి‌ల్‌‌తో కలిపి ఇస్తే రూ.32 తీసుకుంటున్నారు.

Advertisement

తక్కువ ధరకే స్వచ్ఛమైన చెరుకు రసం లభిస్తుండటంతో జనం కుప్పలు తెప్పలుగా తరలివస్తున్నారు. లీటర్ల కొద్దీ బాటిళ్లలో నింపుకొని వెళ్తున్నారు. ‘ఇంత తక్కువ ధరకు లీటర్ రసం రావడం అంటే గిఫ్ట్ లాంటిదే’ అని కొనుగోలుదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం? మీరు కూడా ఆ రూట్లోకి వెళ్తుంటే ఓ బాటిల్ పట్టుకెళ్లి చల్లని చెరుకు రసాన్ని ఆస్వాదించండి!

Also Read: కాంగ్రెస్‌కు కవిత కౌంటర్ బడ్జెట్.. రూ. 2.23 లక్షల కోట్లతో మైండ్ బ్లాకింగ్ ప్లాన్!

Advertisement

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×