E-Paper
Advertisement

Hockey Qualifiers: తెలంగాణ క్రీడా రంగానికి అంతర్జాతీయ గుర్తింపు.. ముగిసిన మహిళల హాకీ వరల్డ్ క్వాలిఫైయింగ్ పోటీలు

Hockey Qualifiers: తెలంగాణ క్రీడా రంగానికి అంతర్జాతీయ గుర్తింపు.. ముగిసిన మహిళల హాకీ వరల్డ్ క్వాలిఫైయింగ్ పోటీలు
Advertisement

Hockey Qualifiers: హైదరాబాద్ నగరం మరోసారి అంతర్జాతీయ క్రీడా వేదికగా నిలిచింది. నగరంలోని గచ్చిబౌలి హాకీ స్టేడియం వేదికగా నిర్వహించిన మహిళల హాకీ వరల్డ్ క్వాలిఫయింగ్ పోటీలు క్రీడా ప్రపంచాన్ని ఆకట్టుకుంటూ విజయవంతంగా ముగిశాయి. తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈ పోటీలు కేవలం క్రీడలకే పరిమితం కాకుండా, తెలంగాణ ఆతిథ్యం, నిర్వహణ సామర్థ్యం, క్రీడల పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిబద్ధతను ప్రపంచానికి చాటి చెప్పాయి. ఈ నెల 8న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోటీలను ప్రారంభించారు. వివిధ దేశాల నుంచి వచ్చిన క్రీడాకారులు, అధికారులు, ప్రేక్షకులతో స్టేడియం కిక్కిరిసిపోయి పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది. ప్రారంభ వేడుకలు తెలంగాణ సంస్కృతి, క్రీడా ఉత్సాహం కలగలిపిన ఒక విశేషమైన క్షణంగా నిలిచాయి.

Also Read: Salman Butt: తూచ్ అంతా ఫిక్సింగే..గోల్డ్ బిస్కెట్ల‌కు న్యూజిలాండ్ ప్లేయ‌ర్లు అమ్ముడుపోయారు !

మహిళల హాకీ ప్రపంచ కప్ పోటీలకు అర్హత

Advertisement

ఈ క్వాలిఫయింగ్ పోటీలు ప్రపంచ హాకీ క్యాలెండర్‌లో ప్రాముఖ్యత కలిగినవి. ఆగస్టు 14 నుంచి 30 వరకు నేథర్లండ్స్, బెల్జియం దేశాల్లో జరగబోయే మహిళల హాకీ ప్రపంచ కప్ పోటీలకు అర్హత సాధించేందుకు ఈ మ్యాచ్లు నిర్వహించారు. ఈ పోటీల్లో భారత్‌తో పాటు ఆస్ట్రియా , ఇంగ్లాండ్ , ఇటలీ , కొరియా, స్కోట్లాండ్ , ఉరుగ్వే వేల్స్ వంటి దేశాల జట్లు పాల్గొన్నాయి. ప్రతి మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. ప్రపంచంలోని విభిన్న దేశాల ఆటగాళ్లు తమ ప్రతిభను ప్రదర్శిస్తూ క్రీడా స్ఫూర్తిని ప్రతిబింబించారు. మ్యాచ్‌ల మధ్య విరామ సమయంలో నిర్వహించిన లేజర్ షో, సంగీత కార్యక్రమాలు ప్రేక్షకులను అలరించాయి. దీంతో స్టేడియం మొత్తం ఒక క్రీడా ఉత్సవంలా మారింది.

మహిళల హాకీ వరల్డ్ క్వాలిఫయింగ్ పోటీలు

అంతర్జాతీయ ప్రమాణాలతో పోటీలను నిర్వహించడం ద్వారా తెలంగాణ రాష్ట్రం క్రీడా రంగంలో తన సామర్థ్యాన్ని మరోసారి నిరూపించింది. భవిష్యత్తులో మరిన్ని అంతర్జాతీయ క్రీడా పోటీలకు హైదరాబాద్ కేంద్రంగా మారే అవకాశాలు ఉన్నాయని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గచ్చిబౌలిలో జరిగిన మహిళల హాకీ వరల్డ్ క్వాలిఫయింగ్ పోటీలు తెలంగాణ క్రీడా చరిత్రలో ఒక ప్రత్యేక అధ్యాయంగా నిలిచాయి. ఈ పోటీల ద్వారా రాష్ట్రం క్రీడల అభివృద్ధికి ఎంత ప్రాధాన్యం ఇస్తోందో ప్రపంచానికి తెలిసింది.

Advertisement

Also Read: WhatsApp AI Update: మీ వాట్సాప్‌లో ఈ మార్పును గమనించారా? కమ్యూనిటీ ట్యాబ్ మాయం, ఎందుకో తెలుసా?

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×