E-Paper
Advertisement

Telugu Student Shot Dead: అమెరికాలో మళ్లీ కాల్పులు, హైదరాబాద్ యువకుడు మృతి

Telugu Student Shot Dead: అమెరికాలో మళ్లీ కాల్పులు, హైదరాబాద్ యువకుడు మృతి
Advertisement

Telugu Student Shot Dead: అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. ఈ ఘటనలో హైదరాబాద్‌కి చెందిన ఓ యువకుడు మృతి చెందాడు. ఈ విషయంలో తెలియగానే యువకుడి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరు అయ్యారు.

పైన కనిపిస్తున్న యువకుడి పేరు రవితేజ. చైతన్యపురి పరిధిలో ఆర్కేపురం గ్రీన్ హిల్స్ కాలనీకి చెందిన కొయ్యడ చంద్రమౌళి కుమారుడు రవితేజ. మూడేళ్లు కిందట అమెరికా వెళ్లాడు. అక్కడే మాస్టర్ డిగ్రీ పూర్తి చేశాడు. ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు.

Advertisement

అక్కడి కాలమానం ప్రకారం.. ఆదివారం వాషింగ్టన్‌కు వెళ్లాడు. ఏవ్‌లో దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డాడు రవితేజ. కాల్పుల గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఈలోగా అంబులెన్స్‌లు వచ్చాయి. అతడ్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయినా ఫలితం లేకపోయింది.

రవితేజ చనిపోయిన విషయాన్ని అక్కడికి పోలీసులు హైదరాబాద్‌లో పేరెంట్స్‌కి తెలిపారు. ఫోన్‌లో కొడుకు లేడన్న సమాచారం విన్నగానే పేరెంట్స్ షాకయ్యారు. అతడి నివాసంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. చేతికి అంది వచ్చిన కొడుకు కానరాని లోకాలకు వెళ్లిపోయాడని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తమ కొడుకు ఇక లేడన్న విషయాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.

Advertisement

ALSO READ:  కేటీఆర్‌కు మళ్లీ నోటీసు..! ఈసారి అరెస్ట్ ఖాయం?

 

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×