// // Child Driving: రద్దీ రోడ్డుపై ఆరేళ్ల మనవరాలికి కారు డ్రైవింగ్ నేర్పిన ఎస్ఐ.. నిలదీస్తే 'నా ఇష్టం' అంటూ హల్‌చల్! -->
E-Paper
Advertisement

రద్దీ రోడ్డుపై ఆరేళ్ల మనవరాలికి కారు డ్రైవింగ్ నేర్పిన ఎస్ఐ.. నిలదీస్తే ‘నా ఇష్టం’ అంటూ హల్‌చల్!

రద్దీ రోడ్డుపై ఆరేళ్ల మనవరాలికి కారు డ్రైవింగ్ నేర్పిన ఎస్ఐ.. నిలదీస్తే ‘నా ఇష్టం’ అంటూ హల్‌చల్!
Advertisement

Child Driving: చట్టాన్ని రక్షించాల్సిన వారే నడిరోడ్డుపై నిబంధనలను ఉల్లంఘిస్తే ఎలా ఉంటుందో చూపించే ఘటనిది. హైదరాబాద్ పరిధిలోని గంధంగూడ–బైరాగిగూడ ప్రధాన రహదారిపై ఒక పోలీస్ ఆఫీసర్ బాధ్యతారహితంగా వ్యవహరించిన తీరు ప్రస్తుతం తీవ్ర కలకలం రేపుతోంది. రద్దీగా ఉండే మెయిన్ రోడ్డుపై తన ఆరేళ్ల మనవరాలితో కారు నడిపించి సామాన్య ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడారు.

ఆరేళ్ల మనవరాలికి కారు డ్రైవింగ్..

Advertisement

రంగారెడ్డి జిల్లాకు చెందిన సదరు సబ్ ఇన్‌స్పెక్టర్ (SI), నిత్యం వందలాది వాహనాలతో బిజీగా ఉండే గంధంగూడ ప్రధాన రహదారిపై తన ఆరేళ్ల మనవరాలికి కారు డ్రైవింగ్ నేర్పించడం మొదలుపెట్టారు. ఒక మైనర్ బాలిక, అది కూడా ఆరేళ్ల చిన్నారి కారు స్టీరింగ్ పట్టుకోవడంతో ఆ వాహనం రోడ్డుపై ప్రమాదకరంగా కదిలింది. దీనివల్ల వెనుక వచ్చే వాహనాలు నిలిచిపోయి, కిలోమీటర్ల మేర ‘బంపర్ టు బంపర్’ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రోడ్డు భద్రతను గాలికొదిలేసి చేసిన ఈ పనితో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

ప్రశ్నించిన జనం.. ఎస్ఐ దబాయింపు!

Advertisement

రోడ్డుపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోవడంతో స్థానికులు, వాహనదారులు సదరు ఎస్ఐని ప్రశ్నించారు. ఇంత రద్దీగా ఉండే చోట చిన్నారితో డ్రైవింగ్ ఏంటని నిలదీయగా.. ఆ అధికారి కనీసం తప్పు తెలుసుకోకుండా దురుసుగా ప్రవర్తించారు. ‘నా ఇష్టం.. నన్ను అడగడానికి మీరెవరు?’ అంటూ ప్రజలపైనే దబాయించడం అక్కడ ఉన్నవారిని ముక్కున వేలేసుకునేలా చేసింది.

Also Read: వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ అరెస్ట్!

సోషల్ మీడియాలో వైరల్.. యాక్షన్ కి డిమాండ్

ఈ ఉదంతాన్ని కొందరు మొబైల్స్‌లో రికార్డ్ చేయడంతో దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు, స్థానికులు ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చట్టం, ట్రాఫిక్ నిబంధనలు సామాన్యులకేనా, పోలీసులకు వర్తించవా? అని ప్రశ్నిస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి సదరు ఎస్ఐపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

?igsh=a2prZmdnMXd2YjVh

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×