E-Paper
Advertisement

Government Land Encroachment: రూ. 2 వేల కోట్ల భూ దందా.. నకిలీ పత్రాలతో ప్రభుత్వ భూమికి ఎసరు!

Government Land Encroachment: రూ. 2 వేల కోట్ల భూ దందా.. నకిలీ పత్రాలతో ప్రభుత్వ భూమికి ఎసరు!
Advertisement

Government Land Encroachment: ప్రస్తుత కాలంలో  ప్రభుత్వ ఆస్తిని  గౌరవం వించాల్సింది పోయి..  ప్రభుత్వ భూమి అంటే ఎవరైనా ఆక్రమించుకోవచ్చు అనే చులకన భావం పెరిగిపోయింది. సమాజంలో ఎక్కడైనా ఒక ఖాళీ స్థలం కనిపిస్తే చాలు..  అది ప్రజల అవసరాల కోసం కేటాయించినదా లేక ప్రభుత్వానిదా అనే విచక్షణ లేకుండా కొందరు స్వార్థపరులు దానిపై కన్నేస్తున్నారు. కొందరు పలుకుబడి ఉన్న వ్యక్తులు  ప్రభుత్వ భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు. ఇప్పుడు హైదరాబాద్ నగరంలో ప్రభుత్వ భూములు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకునే ప్రయత్నంలో ఓ పెద్ద ముఠానే బయటపడింది.

ప్రభుత్వ భూమిని కొట్టేసేందుకు ఓ ముఠా పెద్ద ప్లానే వేసిందని చెప్పవచ్చు.  లేని దస్తా వేజులు సృష్టించి ఏకంగా..  రూ.2 వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కొట్టేసేందుకు ఓ ముఠా.. ఏకంగా 58 ఏళ్ల క్రితం రిజిస్ట్రేషన్ జరిగినట్లు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించింది. వాటినే లింకు డాక్యుమెంట్లుగా పేర్కొంటూ 43 ఎకరాల భూమిని తమ పేరిట రిజిస్టర్ చేయించుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఈ మొత్తం భూమిని కబ్జా చేసేందుకు తొలుత ఎకరం భూమితో ఈ ప్రయోగం చేసింది. ఇందులో కోర్టును కూడా తప్పుదోవ పట్టించి.. ఎకరం భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకుంది. దానిని ఆసరాగా చేసుకొని 43 ఎకరాల భూమిని ఆక్రమించేందుకు ఈ భూమి చుట్టూ కంచె వేసినా రెవెన్యూ అధికారులు పట్టించుకోలేదు.

Advertisement

రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం, మక్తా మహబూబ్పేట పరిధిలో సర్వే నంబరు 44లోని 43.13 ఎకరాల భూమిని అక్రమార్కులు ఆక్రమించారు. ఇందుకోసం చుట్టూ కంచె వేశారు. 1967 లో రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు నకిలీ లింక్ డాక్యుమెంట్లు సృష్టించారు. లింకు డాక్యుమెంట్ ఆధారంగా ఈ ఏడాది ఒక ఎకరా భూమి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ధీని ఆసరాగా చేసుకొని మిగతా భూమిని కూడా తమ సొంతం చేసుకునెందుకు సంబంధిత అధికారులు కబ్జా దారులకు సహకరించారు. లింక్ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ జరిగిన తేదీ 1967 ఫిబ్రవరి 12గా పేర్కొన్నారు. అయితే ఆ రోజు ఆదివారం కావడంతో.. సెలవు రోజు రిజిస్ట్రేషన్ శాఖ ఎలా పని చేసిందన్న క్లూ దొరికింది. దీంతో ఇవన్నీ నకిలీ పత్రాలు అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

కబ్జాదారులకు సహకరించిన సబ్‌ రిజిస్ట్రార్‌ కె.మధుసూదన్‌ రెడ్డిని అధికారులు సస్పెండ్‌ చేశారు. మధుసూదన్‌ రెడ్డిపై పీడీ యాక్ట్‌ కేసు నమోదు చేసి.. జైలుకు పంపాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ ఆదేశించారు.

Advertisement

ALSO READ:గొర్రె, మేకల రక్తాన్ని తీసి.. ఆ మాఫియా గుట్టురట్టు

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×