E-Paper
Advertisement

Hyderabad School: విద్యార్థికి గుండు కొట్టిన ప్రిన్సిపాల్.. జుట్టు తిరిగివ్వాలని పేరెంట్స్ ఆందోళన

Hyderabad School: విద్యార్థికి గుండు కొట్టిన ప్రిన్సిపాల్.. జుట్టు తిరిగివ్వాలని పేరెంట్స్ ఆందోళన
Advertisement

Hyderabad School: హైదరాబాద్ లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. చెప్పినట్టుగా జుట్టు కత్తిరించుకోలేదని ప్రిన్సిపల్​ ఏకంగా ఓ విద్యార్థికి గుండు కొట్టించాడు. దీనిపై విద్యార్థి తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కూల్ వద్దకు వచ్చి నిరసన తెలిపారు. దాంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది.

వివరాల్లోకి వెళ్తే..

మియాపూర్ ప్రేమ్​ నగర్ బీ బ్లాక్ లో ‘బ్లాక్​ బోర్డ్​ ది స్కూల్’​ నడుస్తోంది. దీంట్లో 9వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థి దేవుని మొక్కు ఉన్న నేపథ్యంలో తల్లిదండ్రులు చెప్పారని జుట్టు పెంచుకున్నాడు. ఇదిలా ఉండగా స్కూల్ ప్రిన్సిపల్​ ఇటీవల రెండు మూడుసార్లు జుట్టు కత్తిరించుకోవాలని సదరు విద్యార్థితో చెప్పాడు. అయినా, జుట్టు కత్తిరించుకోక పోవటంతో ఆయన కోపం కట్టలు తెంచుకుంది.

‘నా బిడ్డ జుట్టు ఇవ్వండి’

Advertisement

జుట్టు పెంచడానికి గల కారణం ఏమిటో తెలుసుకునే ప్రయత్నం కూడా చేయకుండా సోమవారం ప్రిన్సిపల్ ఆ విద్యార్థికి గుండు కొట్టించాడు. విషయం తెలిసి విద్యార్థి తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కూల్​ ఎదుట ఆందోళనకు దిగారు. దేవుని మొక్కు ఉన్నందున తామే జుట్టు పెంచుకోవాలని బిడ్డకు సూచించినట్లు తెలిపారు. మెుక్కు నేపథ్యంలో తన కొడుకు జుట్టును తిరిగి ఇప్పించాలని డిమాండ్ చేశారు.

Also Read: Vi Annual Plans 2026: వీఐ వార్షిక ప్లాన్స్.. రోజుకి 2GB డేటా, ఫ్రీ ఓటీటీ.. ఇవి చాలా చీప్ గురు!

తప్పు ఒప్పుకున్న ప్రిన్సిపల్

Advertisement

అయితే దేవుని మొక్కు ఉన్నట్టు తెలియక పోవటం వల్లనే ప్రిన్సిపల్​ గుండు కొట్టించాడని స్కూల్ కరస్పాండెంట్​ వీరేశం చెప్పారు. ఇది ప్రిన్సిపల్​ తప్పిదమే అని ఆయన అంగీకరించారు. దాంతో విద్యార్థి తల్లిదండ్రులు శాంతించి అక్కడి నుంచి వెనుదిరిగారు. దీనిపై మియాపూర్ పోలీసులతో మాట్లాడగా జరిగిన సంఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని చెప్పారు. కాగా మీడియాలో వచ్చిన వార్తల ఆధారంగా ఈ వ్యవహారంపై విచారణ చేస్తున్నట్లు ఎంఈవో వెంకటయ్య తెలిపారు.

Also Read: CM Chandrababu Naidu: కరెంట్ ఛార్జీలు పెంచనని మళ్లీ హామీ ఇస్తున్నా: సీఎం చంద్రబాబు

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×