E-Paper
Advertisement

Hyderabad: హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. ఏసీ బస్సు టికెట్లలో భారీ డిస్కౌంట్!

Hyderabad: హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. ఏసీ బస్సు టికెట్లలో భారీ డిస్కౌంట్!
Advertisement

Hyderabad: స్వేచ్ఛ బ్యూరో: వాహనదారులకు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆఫర్ ప్రకటించింది. పెట్రోల్ బంకుల వద్ద గంటల తరబడి వేచి చూస్తున్న సామాన్యుడి కష్టాలను గమనించి, సుఖవంతమైన ప్రయాణాన్ని తక్కువ ధరకే అందిస్తామని ప్రకటించింది. హైదరాబాద్ ప్రయాణికులకు మాత్రమే ఆఫర్ అని పేర్కొంది. హైదరాబాద్ పరిధిలోని మెట్రో ఏసీ, మెట్రో డీలక్స్ బస్సుల్లో టికెట్ ధరలపై 30 శాతం రాయితీని కల్పిస్తున్నట్లు సంస్థ వీసీ,ఎండీ వై.నాగిరెడ్డి ప్రకటించారు. మీడియా ప్రకటన విడుదల చేశారు.

పెట్రోల్ క్యూలకు గుడ్‌బై

Advertisement

పెట్రోల్ ఇబ్బందులు పడటం ఎందుకు దండగ.. ఆర్టీసీ బస్సులు ఉండగా.. అంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. సమయం, ఇంధనం ఆదా , క్యూ లైన్లకు స్వస్తి అని పేర్కొన్నారు. పెట్రోల్ కోసం కిలోమీటర్ల మేర క్యూలైన్లలో నిలబడి విలువైన సమయాన్ని వృథా చేసుకోవద్దని సూచించారు. సొంత వాహనాల కోసం గంటల తరబడి వేచి చూసే బదులు, క్షేమంగా, వేగంగా గమ్యస్థానాలకు చేరడానికి ఆర్టీసీ బస్సులే మేలని పేర్కొన్నారు.

వ్యక్తిగత వాహనాలకు బ్రేక్

Advertisement

ఇంధన పొదుపు – దేశాభివృద్ధికి మలుపు అని, ఇంధన సంక్షోభం నెలకొన్న తరుణంలో ప్రతి చుక్క పెట్రోల్ విలువైనదేనని, వ్యక్తిగత వాహనాలను పక్కన పెట్టి ప్రజా రవాణాను ఆశ్రయించడం ద్వారా ఇంధనాన్ని ఆదా చేయవచ్చని, ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా తోడ్పడుతుందని ఆయన తెలిపారు. పర్యావరణానికి మేలు – కాలుష్య రహిత ప్రయాణం అని, రోడ్లపై వాహనాల రద్దీ తగ్గడం వల్ల ట్రాఫిక్ సమస్యలు తీరడమే కాకుండా, కాలుష్యం కూడా తగ్గుతుందన్నారు.

జేబుకు హాయి… ప్రయాణం లగ్జరీ

ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సుల్లో ప్రయాణించడం ద్వారా పర్యావరణ పరిరక్షణలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని కోరారు. జేబుకు హాయి – ప్రయాణం సుఖవంతం అని, సాధారణంగా ఏసీ బస్సులు ఖరీదు అనుకునే వారికి 30% రాయితీ ఒక గొప్ప అవకాశం అని, పెట్రోల్ ధరల సెగ నుంచి తప్పించుకుని, అతి తక్కువ ధరకే లగ్జరీ ప్రయాణాన్ని ఆస్వాదించవచ్చు అని, ఇది సామాన్యుడి జేబుకు, ప్రయాణానికి ఎంతో హాయినిస్తుందని పేర్కొన్నారు. బంకుల వద్ద బారులు తీరొద్దు… సేఫ్ గా బస్సెక్కండి… సుఖవంతమైన ప్రయాణం చెయ్యండి” అని నగరవాసులకు విజ్ఞప్తి చేశారు. నగర ప్రజలు ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, ట్రాఫిక్ , పెట్రోల్ ఇబ్బందుల నుంచి బయటపడాలని ఆర్టీసీ ఆకాంక్షిస్తోందని తెలిపారు.

Also Read:  అనుమతి ఒక అంతస్తు.. నిర్మాణం ఐదు అంతస్తులు.. ఇదెక్కడి వింత?

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×