E-Paper
Advertisement

ఇది మెట్రో స్టేషనా? తిరుమల క్యూ లైనా? హైదరాబాద్ వాన బీభత్సం విజువల్స్ చూస్తే షాక్ అవుతారు!

ఇది మెట్రో స్టేషనా? తిరుమల క్యూ లైనా? హైదరాబాద్ వాన బీభత్సం విజువల్స్ చూస్తే షాక్ అవుతారు!
Advertisement

Hyderabad Rains: నిన్న సాయంత్రం ఆఫీస్ ముగించుకుని హాయిగా ఇంటికి వెళ్దామనుకున్న హైదరాబాద్ ఐటీ ఉద్యోగులకు, సామాన్యులకు వరుణుడు ఊహించని షాక్ ఇచ్చాడు. కేవలం గంటపాటు కురిసిన ఊరబావి వానకు భాగ్యనగరం ఒక్కసారిగా స్తంభించిపోయింది. రోడ్లన్నీ చెరువులను తలపించడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో విసిగిపోయిన జనం ప్రత్యామ్నాయంగా మెట్రో వైపు పరుగులు తీశారు. ఫలితంగా నగరంలోని మెట్రో స్టేషన్లన్నీ మనుషులతో కిక్కిరిసిపోయి, ఏదో ఊరి జాతరను తలపించాయి.

హైదరాబాద్‌లోని ప్రధాన కూడళ్లయిన మాదాపూర్, హైటెక్ సిటీ, అమీర్‌పేట్, రాయదుర్గం వంటి ప్రాంతాల్లో పరిస్థితి మరీ ఘోరంగా మారింది. రోడ్డుపై వాహనాలు ఇంచ్ కూడా కదలని పరిస్థితి రావడంతో, కేవలం 15 నిమిషాల ప్రయాణానికి 3 నుండి 4 గంటల సమయం పట్టింది. బైక్‌లు, కార్లు ఉన్నవారు సైతం వాటిని ఆఫీస్ పార్కింగ్‌ల్లోనే వదిలేసి మెట్రో స్టేషన్లకు పరుగులు తీశారు.

Advertisement

తీరా స్టేషన్లకు వెళ్తే అక్కడ అంతకంటే పెద్ద షాక్ ఎదురైంది. టికెట్ కౌంటర్ల దగ్గర, ప్లాట్‌ఫారమ్‌లపై వేల సంఖ్యలో జనం చేరడంతో కాలు పెట్టేందుకు కూడా స్థలం లేకుండా పోయింది. మెట్రో రైళ్లలోకి ఎక్కడానికి ప్రయాణికులు తీవ్రంగా తోపులాట పడాల్సి వచ్చింది. ఇందుకు సంబంధించిన విజువల్స్, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ‘ఇది మెట్రో స్టేషనా లేక తిరుమల క్యూ లైనా?’ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మౌలిక వసతుల లోపాలు, డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడం వల్లే ప్రతి చిన్న వానకూ నగరం ఇలా నరకప్రాయంగా మారుతోందని నగరవాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: వాహన యజమానులకు గుడ్‌న్యూస్.. డ్రైవింగ్ లైసెన్స్‌ వ్యాలిడిటీ 50 ఏళ్లకు పెంపు!

Advertisement

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×