E-Paper
Advertisement

Hyderabad News: సంక్రాంతి పండగ ప్రయాణం.. హైదరాబాద్‌ పోలీసుల అలర్ట్.. ఇలా చేస్తే మీ ఇల్లు సేఫ్

Hyderabad News: సంక్రాంతి పండగ ప్రయాణం.. హైదరాబాద్‌ పోలీసుల అలర్ట్..  ఇలా చేస్తే మీ ఇల్లు సేఫ్
Advertisement

Hyderabad News: సంక్రాంతి వచ్చిందంటే చాలు హైదరాబాద్ నగరం బోసిపోతుంది. సిటీ నుంచి ఏపీలోని సొంతూళ్లకు లక్షలాది మంది పయనమవుతారు. అందుకోసం కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక రైళ్లు, బస్సులు వేస్తుంటాయి. అయినా టికెట్లు దొరక్క చాలామంది ఇబ్బంది పడుతున్న సందర్భాలు ఉంటాయి. ఇదే అదునుగా భావించి దొంగలు చెలరేగిపోతుంటారు. ఈ క్రమంలో హైదరాబాద్‌వాసులకు మూడు పోలీసు కమిషనరేట్ల పోలీసు అధికారులు కీలక సూచనలు చేశారు. వాటిలో ఏ ఒక్కటి మిస్సయినా ఇళ్లు గుల్లయిపోవడం ఖాయం.

హైదరాబాద్‌వాసులకు పోలీసుల అలర్ట్

Advertisement

ప్రతీ ఏటా సంక్రాంతికి హైదరాబాద్ సిటీ నుంచి సొంతూరు దాదాపు 25 నుంచి 40 లక్షల మంది వరకు వెళ్తుంటారు. అందుకోసం ఏపీకి వెళ్లేవారికి శాతం ఎక్కువగా ఉంటుంది.  తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఒరిస్సా లకు వెళ్తుంటారుఅందుకోసం ముందుగా ప్లాన్ చేసుకుంటారు. పండుగను తమకు అనుకూలంగా మార్చుకునే పనిలో పడ్డారు దొంగలు. 

ఊళ్లకి వెళ్లే వారి ఇళ్లను టార్గెట్ చేస్తూ దొంగతనాలకు పాల్పడుతుంటారు. గతంలో ఈ తరహా ఘటనలు చాలానే జరిగాయి కూడా. వాటిని దృష్టిలో పెట్టుకున్న హైదరాబాద్ సిటీలోని మూడు కమిషనరేట్ల పరిధిలోని పోలీస్ అధికారులు శనివారం సమావేశం అయ్యారు. కీలక సూచనలు చేశారు హైదరాబాద్ సీపీ సజ్జనార్.

Advertisement

ఇలా చేస్తే మీ ఇల్లు సేఫ్-పోలీసుల సూచనలు

ప్రజలు కూడా ఊరు వెళ్ళేటప్పుడు బంగారు ఆభరణాలను ఇంట్లో పెట్టకుండా లాకర్లు లేకుంటే బ్యాంకు లాకర్లలో పెట్టుకోవాలన్నారు. అలాగే ఊరు వెళ్ళేటప్పుడు మీ ఇంటి తాళం చెవిని ఇంటి పక్క వాళ్లకు ఇవ్వడం, షూ రాకుల్లో పెట్టడం చేయవద్దన్నారు. వ్యక్తుల మానసిక పరిస్థితి దృష్టిలో పెట్టుకుని తాళం చెవి ఎక్కడ పెడతామో దొంగలు ముందుగానే అంచనా వేస్తారని తెలిపారు.

ఇంటి ఒరిజినల్ కీని మీ వెంటే స్వయంగా తీసుకెళ్లాలని తెలిపారు. గతంలో పండుగ సందర్భంగా జరిగిన దొంగతనాలు జరిగిన ప్రాంతాలను గుర్తించినట్టు తెలిపారు. వాటిని హాట్ స్పాట్‌లుగా గుర్తించాము. అలాగే బస్టాండ్, రైల్వేస్టేషన్లు, హోటల్స్ ప్రత్యేకంగా తనిఖీలు చేస్తూ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

ఈ విషయంలో ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. చైన్స్నాచింగ్, టూ వీలర్స్ చోరీకి గురయ్యే అవకాశం ఉందన్నారు. ప్రజలు సమీపంలో పోలీసులకు సమాచారం ఇస్తే ఆ ఇళ్లపై ప్రత్యేకంగా నిఘా పెడతారని తెలిపారు. గతంలో నేరాలు నమోదైన ప్రాంతాలను గుర్తించి, గస్తీ పెంచడం, ఆపై తనిఖీలు చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు.

ALSO READ:  చేప చర్మంతో కుక్కకు సర్జరీ, హైదరాబాద్ డాక్టర్ల ఘనత

సొంత ఇళ్లయితే ఇంటి ముందు తలుపులకు సెంటర్‌ లాక్‌ వేయాలి. ఇంటి ముందు నిత్యం చెప్పులు ఉండేలా చూడాలి. బయట గేటుకు లోపలి నుంచి తాళం తప్పకుండా వేయాలి. అలాగే పేపర్‌ బాయ్, పాలు పోసేవారికి ముందుగా చెప్పాలి. ఊరికి వెళ్లేటప్పుడు నమ్మకమైనవారు, పోలీసులకు తప్పకుండా సమాచారం ఇవ్వాలి. ఇక కాలనీ, ఇంట్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం ఉత్తమమని తెలిపారు.

ఇంటి తలుపుకు వేసిన తాళం బయటకు కనిపించకుండా అడ్డుగా పరదా వేయాలన్నారు. అనుమానం వస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. బీరువా తాళాలు, ఇంట్లో కబ్‌ బోర్డులు సులువుగా గుర్తించే ప్రదేశాల్లో ఉంచకూడదని ముఖ్యమైన సూచన. రాత్రుళ్లు ఇంట్లోని ఓ గదిలో లైట్‌ వెలిగేలా చూసుకోవాలి. ఇంటికి సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు ఫోన్ చేసి తెలుసుకుంటూ ఉండాలి.

 

 

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×