E-Paper
Advertisement

Eagle Team: న్యూఇయర్.. ఎవరైనా అలా చేస్తే అంతే సంగతులు, 150 మందితో..?: ఈగల్ ఎస్పీ సీతారాం

Eagle Team: న్యూఇయర్.. ఎవరైనా అలా చేస్తే అంతే సంగతులు, 150 మందితో..?: ఈగల్ ఎస్పీ సీతారాం
Advertisement

Eagle Team: హైదరాబాద్‌లో నూతన సంవత్సర వేడుకల వేళ మాదకద్రవ్యాల నియంత్రణే లక్ష్యంగా తెలంగాణ పోలీస్ యాంటీ నార్కోటిక్ బ్యూరో (Eagle Team) కఠిన చర్యలకు సిద్ధమైంది. డిసెంబర్ 31 రాత్రి నగరవ్యాప్తంగా ముమ్మరంగా డ్రగ్ టెస్టులు నిర్వహించనున్నట్లు ఈగల్ టీమ్ ఎస్పీ సీతారాం స్పష్టం చేశారు. యువత పెడదారి పట్టకుండా..  వేడుకలు ప్రశాంతంగా సాగేలా భారీ ఏర్పాట్లు చేసినట్లు ఆయన వెల్లడించారు.

డ్రగ్స్ వినియోగాన్ని అరికట్టేందుకు 150 మంది సభ్యులతో కూడిన 12 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించుతున్నారు. ఈ బృందాలు హైదరాబాద్‌లోని పబ్‌లు, క్లబ్‌లు, రిసార్టులు,  శివార్లలోని ఫాంహౌజ్‌లపై ప్రత్యేక నిఘా ఉంచనున్నాయి. ఎక్కడ అనుమానం వచ్చినా వెంటనే తనిఖీలు చేసేలా అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి.

Advertisement

ఈ ఏడాది తనిఖీల్లో పోలీసుల ప్రధాన దృష్టి డీజేలపై ఉండనుంది. సాధారణంగా పబ్‌లలో పార్టీ వాతావరణాన్ని వేడెక్కించే డీజే నిర్వాహకుల నుంచే ఈసారి టెస్టులు ప్రారంభించనున్నట్లు ఎస్పీ సీతారాం తెలిపారు. పబ్‌లలో తనిఖీలు మొదలవ్వగానే మొదట డీజే ఆపరేటర్లకు డ్రగ్ టెస్ట్ చేస్తామని.. ఆ తర్వాత అనుమానిత వ్యక్తులకు, ఇతర సిబ్బందికి పరీక్షలు నిర్వహిస్తామని..  డ్రగ్స్ సరఫరాలో లేదా వినియోగంలో డీజేల పాత్ర ఉన్నట్లు తేలితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

గతంలో లాగా కేవలం అనుమానంతో వదిలేయకుండా..  ఈసారి సలైవా (లాలాజలం) డ్రగ్ టెస్ట్ కిట్‌లను పోలీసులు వినియోగిస్తున్నారు. కేవలం కొద్ది నిమిషాల్లోనే ఒక వ్యక్తి డ్రగ్స్ తీసుకున్నారో లేదో ఈ కిట్ ద్వారా నిర్ధారించవచ్చు. ఒకవేళ పరీక్షలో పాజిటివ్ అని తేలితే మాత్రం..  సదరు వ్యక్తిపై ఎన్డీపీఎస్ (NDPS) చట్టం ప్రకారం కఠినమైన కేసులు నమోదు చేస్తామని ఎస్పీ స్పష్టం చేశారు.

Advertisement

‘ఎంజాయ్‌మెంట్ అంటే డ్రగ్స్ తీసుకోవడం కాదు.. ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు’ అని ఎస్పీ సీతారాం యువతకు హితవు పలికారు. కేవలం కొన్ని గంటల ఆనందం కోసం జీవితాలను నాశనం చేసుకోవద్దని ఆయన కోరారు. ఫాంహౌజ్ పార్టీల పేరుతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే యజమానులపై కూడా చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

ALSO READ: Immanuel Bigg Boss: బిగ్ బాస్ హౌస్‌లో నటించడం అంత ఈజీ కాదు.. ఇమ్మాన్యుల్

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×