E-Paper
Advertisement

CP Sajjanar Warning: చైనా మాంజా వాడితే క్రిమినల్ కేసులే.. పండుగ పూట జాగ్రత్త!

CP Sajjanar Warning: చైనా మాంజా వాడితే క్రిమినల్ కేసులే.. పండుగ పూట జాగ్రత్త!
Advertisement

CP Sajjanar Warning: సంక్రాంతి వచ్చిందంటే చాలు.. ఆకాశం రంగురంగుల గాలిపటాలతో నిండిపోతుంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎంతో ఉత్సాహంగా పతంగులు ఎగురవేస్తూ పండగను ఎంజాయ్ చేస్తారు. అయితే.. కొందరి ఇళ్లలో ఈ పండగ ఆనందం క్షణాల్లోనే ఆవిరైపోతోంది. దీనికి గల కారణం మనం ఉపయోగించే మాంజా. దీనిపై పోలీసులు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ దొంగ చాటుగా ఈ మాంజా విక్రయాలు జరుగుతూనే ఉన్నాయి. అక్రమ విక్రయదారులపై ఉక్కుపాదం మోపుతూ హైదరాబాద్ నగర పోలీసులు.. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు రంగంలోకి దిగారు.

హైదరాబాద్ నగరంలో నిషేధిత చైనా మాంజా విక్రయాలు, వినియోగాన్ని అరికట్టేందుకు పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. నగర వ్యాప్తంగా నిర్వహించిన ప్రత్యేక దాడుల్లో మొత్తం 103 కేసులు నమోదు చేసి, 143 మందిని అరెస్ట్ చేసినట్లు హైదరాబాద్ సీపీ సజ్జనార్ వెల్లడించారు. ఈ దాడుల్లో సుమారు రూ.1.24 కోట్ల విలువైన 6,226 చైనా మాంజా బాబిన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

ముఖ్యంగా సౌత్ వెస్ట్ జోన్, సౌత్ జోన్లలో భారీగా చైనా మాంజా నిల్వలు బయటపడినట్లు సీపీ తెలిపారు. ఈ-కామర్స్ వెబ్‌సైట్లు, సోషల్ మీడియా వేదికల ద్వారా చైనా మాంజాను విక్రయిస్తున్న వారిపై ప్రత్యేక నిఘా పెట్టామని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. చైనా మాంజా కారణంగా ఎవరైనా ప్రాణాలు కోల్పోతే, గాలిపటాలు ఎగరేసిన వారిపైనా క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.

ప్రజలు భద్రత దృష్ట్యా చైనా మాంజాను పూర్తిగా నివారించి, కేవలం సాధారణ నూలు దారంతో చేసిన మాంజానే ఉపయోగించాలని సీపీ విజ్ఞప్తి చేశారు. చైనా మాంజా వల్ల పక్షులు, ద్విచక్ర వాహనదారులు, పాదచారులు తీవ్ర ప్రమాదాలకు గురవుతున్నారని ఆయన గుర్తుచేశారు.

Advertisement

గత కొన్ని రోజులుగా పోలీసులు టాస్క్‌ఫోర్స్‌తో కలిసి విస్తృత స్థాయిలో తనిఖీలు నిర్వహించారు. ఢిల్లీ, సూరత్, మహారాష్ట్ర వంటి ప్రాంతాల నుంచి ఆర్డర్ల ద్వారా చైనా మాంజాను తెప్పిస్తున్న దుకాణదారులను గుర్తించి చర్యలు తీసుకున్నారు. సౌత్ వెస్ట్ జోన్‌లో మాత్రమే 34 కేసులు నమోదు కాగా, 46 మందిని అరెస్ట్ చేశారు.

ALSO READ: బైకర్‌ను తప్పించబోయి.. కారును ఢీకొట్టిన లారీ.. ముగ్గురు మృతి

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×