E-Paper
Advertisement

బైక్ కొనాలనుకుంటున్నారా? హైదరాబాద్ పోలీసుల భారీ వేలం.. 1130 వాహనాలు సిద్ధం!

బైక్ కొనాలనుకుంటున్నారా? హైదరాబాద్ పోలీసుల భారీ వేలం.. 1130 వాహనాలు సిద్ధం!
Advertisement

హైదరాబాద్ నగరంలో పాత వాహనాల కొనుగోలుకు సిద్ధంగా ఉన్న వారికి ఇదొక అద్భుత అవకాశం. నగర పోలీసులు భారీ స్థాయిలో వాహనాల వేలం నిర్వహించేందుకు రంగం సిద్ధం చేశారు. ఏళ్ల తరబడి పోలీస్ స్టేషన్ల వద్ద పడి ఉన్న అనాథ వాహనాలకు విముక్తి కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.

నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో స్వాధీనం చేసుకున్న వాహనాలు గుట్టలుగా పేరుకుపోయాయి. వీటిలో ద్విచక్ర వాహనాలు, ఆటో రిక్షాలు, కార్లు ఉన్నాయి. సరైన యాజమాన్య పత్రాలు లేక.. యజమానులు క్లెయిమ్ చేయని కారణంగా ఇవి నిరుపయోగంగా మారాయి. మొత్తం 1,130 వాహనాలను బహిరంగ వేలం ద్వారా విక్రయించాలని నగర పోలీస్ యంత్రాంగం నిశ్చయించింది. అంబర్‌పేట పోలీస్ గ్రౌండ్స్‌ వేదికగా ఈ ప్రక్రియ కొనసాగనుంది.

Advertisement

హైదరాబాద్ సిటీ పోలీస్ యాక్ట్ నిబంధనల ప్రకారం ఈ వేలం నిర్వహిస్తున్నారు. వేలం వేయడానికి ముందే అసలైన యజమానులకు పోలీసులు మరో అవకాశం కల్పించారు. ఈ వాహనాలపై ఎవరికైనా హక్కులు ఉన్నా.. అభ్యంతరాలు ఉన్నా తక్షణమే స్పందించాల్సి ఉంటుంది. బంజారాహిల్స్‌లోని ‘ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్’ వద్ద ఉన్న పోలీస్ కమిషనర్ కార్యాలయంలో తమ వాదన వినిపించవచ్చు. అధికారిక ప్రకటన వెలువడిన ఆరు నెలల గడువులోగా సరైన పత్రాలతో వస్తే తమ వాహనాన్ని తిరిగి పొందే వీలుంటుంది.

నిర్ణీత గడువు ముగిసేలోగా ఎవరూ ముందుకు రాకపోతే ఆ వాహనాలపై యజమానులకు హక్కులు రద్దవుతాయి. ఆ తర్వాత అవన్నీ ప్రభుత్వ ఆస్తిగా పరిగణించబడతాయి. అనంతరం పోలీసులు వాటిని బహిరంగ వేలం వేస్తారు. ఈ వేలానికి సంబంధించిన పూర్తి వివరాలు.. వాహనాల పరిస్థితి.. మోడళ్ల వివరాలను అంబర్‌పేట పోలీస్ హాస్పిటల్ వెనుక ఉన్న ‘SAR CPL’ పోలీస్ గ్రౌండ్స్‌లో పరిశీలించవచ్చు. అక్కడ ఉన్న స్పెషల్ టీమ్ కార్యాలయం వద్ద వాహనాల జాబితాను అందుబాటులో ఉంచారు.

Advertisement

సెకండ్ హ్యాండ్ వాహనాల కోసం చూస్తున్న వారికి.. మెకానిక్ షాపుల నిర్వాహకులకు, స్క్రాప్ వ్యాపారులకు ఇది లాభదాయకమైన సమయం. తక్కువ ధరలో వాహనాలు దక్కించుకునే వెసులుబాటు ఉంటుంది. వేలంలో పాల్గొనదలచిన వారు ముందుగా నిర్ణీత రుసుము చెల్లించి రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. పారదర్శకమైన పద్ధతిలో జరిగే ఈ వేలం ద్వారా నగరంలో వృథాగా ఉన్న వాహనాల సమస్యకు పరిష్కారం దొరకనుంది. నగర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

ALSO READ: చెడ‌గొడ్తున్నారు! కేసీఆర్ వ్యూహాలకు కేటీఆర్ గండి! బీజేపీలో బండి సంజ‌య్ గంద‌ర‌గోళం..!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×