E-Paper
Advertisement

Hot Air Balloon: మణికొండలో తప్పిన ప్రమాదం.. చెరువులో హాట్ ఎయిర్ బెలూన్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ !

Hot Air Balloon: మణికొండలో తప్పిన ప్రమాదం.. చెరువులో హాట్ ఎయిర్ బెలూన్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ !
Advertisement

Hot Air Balloon: హైదరాబాద్‌లోని మణికొండలో పెను ప్రమాదం తప్పింది. నగరంలో కొనసాగుతున్న హాట్ ఎయిర్ బెలూన్ షోలో భాగంగా గాలిలోకి ఎగిరిన ఒక బెలూన్ సాంకేతిక లోపంతో అత్యవసరంగా ల్యాండ్ కావాల్సి వచ్చింది. నేక్నాపూర్ చెరువు సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. షోలో పాల్గొన్న నంబర్ 14 బెలూన్ గాలిలో ఉండగానే అకస్మాత్తుగా సాంకేతిక సమస్య తలెత్తింది. లోపల గాలి ఒత్తిడి తగ్గిపోవడంతో బెలూన్ క్రమంగా కిందికి దిగిపోయింది. అప్రమత్తమైన పైలట్ జనావాసాల మీద పడకుండా బెలూన్‌ను నేక్నాపూర్ చెరువులోని బురద ప్రాంతంలో సురక్షితంగా దింపగలిగారు.

సురక్షితంగా బయటపడ్డ ప్రయాణికులు:
ప్రమాద సమయంలో బెలూన్‌లో ముగ్గురు ప్రయాణికులు ఉన్నారు. బురదలో ల్యాండ్ అయినప్పటికీ, ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. వెంటనే అప్రమత్తమైన సహాయక బృందాలు ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. అనంతరం బెలూన్‌ను ట్రక్కుల సహాయంతో అక్కడి నుంచి తరలించారు.

Advertisement

ఊపిరి పీల్చుకున్న అధికారులు:
బెలూన్ కిందకు దిగుతున్న సమయంలో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయితే.. ఎటువంటి ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరగకపోవడంతో అధికారులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. సాంకేతిక లోపానికి గల కారణాలపై నిర్వాహకులు విచారణ చేపడుతున్నారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×