E-Paper
Advertisement

Ayodhya Laddu : అయోధ్య రామయ్యకు 1265 కేజీల లడ్డూ నైవేద్యం.. తయారీ చేసింది హైదరాబాదీలే..

Ayodhya Laddu : అయోధ్య రామయ్యకు 1265 కేజీల లడ్డూ నైవేద్యం.. తయారీ చేసింది హైదరాబాదీలే..
Advertisement
Ayodhya temple news

Ayodhya temple news(Live tv news telugu):

అయోధ్య రామాలయం ప్రారంభోత్సవం నేపథ్యంలో హైదరాబాద్‌ కంటోన్మెంట్‌ పికెట్‌ ప్రాంతానికి చెందిన శ్రీరామ క్యాటరింగ్‌ సర్వీసెస్‌ యజమాని నాగభూషణంరెడ్డి, కృష్ణకుమారి దంపతులు ప్రత్యేకంగా 1,265 కేజీల భారీ లడ్డును తయారు చేయించారు. దీన్ని వీరు అయోధ్యకు పంపించనున్నారు. ఆలయ నిర్మాణానికి భూమిపూజ జరిగిన మొదలు రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠకు 1,265 రోజులు పట్టింది. దీనికి గుర్తుగా నాగభూషణం దంపతులు అదే సంఖ్య బరువు గల లడ్డూ తయారు చేయించారు.

లడ్డూ అయోధ్యకు చేర్చేందుకు శోభాయాత్రను ప్రారంభించారు. పికెట్‌ లోని తన నివాసం నుంచి శోభాయాత్ర మొదలైంది. ఈ నెల 21 నాటికి అయోధ్యకు చేరుకుంటాయని నాగభూషణంరెడ్డి తెలిపారు. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు నుంచి ముందుగా అనుమతి పొంది, స్వామి వారికి నైవేధ్యంగా సమర్పించేందుకు ఈ భారీ లడ్డూను సిద్ధం చేసినట్లు చెప్పారు.

Advertisement

ఈ లడ్డూ తయారీకి 350 కిలోల శనగపిండి, 700 కిలోల చక్కెర, 40 కిలోల నెయ్యి, 40 కిలోల కాజు, 30 కిలోల కిస్మిస్, 15 కిలోల బాదం, 10 కిలోల పిస్తా, 32 గ్రాముల కుంకుమ పువ్వు వినియోగించారు. ఈ లడ్డూను రాముడి గుడికి 50 మీటర్ల దూరంలో ప్రదర్శనకు ఉంచుతారు. ఆ తర్వాత ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి వచ్చిన భక్తులకు ప్రసాదంగా పంచుతారు.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×