E-Paper
Advertisement

Hyderabad News: కోకాపేట్‌, మూసాపేట్‌ ప్రాంతాల్లో ప్రభుత్వ భూముల వేలం.. ఎకరం రూ.99 కోట్లు

Hyderabad News: కోకాపేట్‌, మూసాపేట్‌ ప్రాంతాల్లో ప్రభుత్వ భూముల వేలం.. ఎకరం  రూ.99 కోట్లు
Advertisement

Hyderabad News: హైదరాబాద్ సిటీలో కీలక ప్రాంతాల్లో ప్రభుత్వ భూములు వేలానికి సిద్ధమయ్యాయి. వివిధ ప్రాంతాల్లో కలిసి మొత్తంగా దాదాపు 43 ఎకరాల భూమి వేలం వేయనుంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది ప్రభుత్వం. సర్కారి వారి పాట ఎకరం రూ.99 కోట్లుగా నిర్ణయించింది. ఆన్‌లైన్ ద్వారా వాటిని వేలం నిర్వహించనుంది.

కోకాపేట్-మూసాపేట్ భూముల వేలం

Advertisement

హైదరాబాద్ మెట్రో పాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ-హెచ్ఎండీఏ భూముల వేలానికి రెడీ అయ్యింది. ఈసారి దాదాపు 43 ఎకరాలను ఈ-వేలం వేలం వేయనుంది. దీనికి సంబంధించి సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది ప్రభుత్వం. కోకాపేట్ నియో పోలీస్‌లోని సర్వే నంబరు 239, 240లో 16 నుంచి 19 ప్లాట్లు ఉన్నాయి.

దాదాపుగా 27 ఎకరాలను వేలానికి రెడీ చేసింది. ఆ ప్రాంతంలో ఎకరం కనీస ధర రూ.99 కోట్లుగా పేర్కొంది. ఈ ప్రాంతంలో ఈసారి రూ.150 కోట్లకుపైగానే పలకవచ్చని అంచనా వేస్తోంది. ప్రభుత్వం ధర ప్రకారం 27 ఎకరాలకు దాదాపుగా నాలుగు వేల కోట్లపైగానే ఆదాయం రావచ్చని అంచనా వేస్తోంది.

Advertisement

సర్కార్ వారి పాట రూ. 99 కోట్లు

రెండేళ్లు కిందట అంటే 2023లో కోకాపేటలో భూములను ప్రభుత్వం వేలం వేసింది. అప్పుడు ఎకరానికి రూ. 100 కోట్లకు పలికింది. ఈసారి దానికి మించి ధర పలికే అవకాశం ఉన్నట్లు హెచ్ఎండీఏ అధికారుల మాట. అందుకు కారణాలు లేకపోలేదు. లేఅవుట్‌కు ఓ వైపు రెండు కిలోమీటర్ల దూరంలో ఓఆర్ఆర్, మరోవైపు రాయదుర్గంలో ఐటీ కంపెనీలు ఉన్నాయి.

ఇంకోవైపు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఉండడంతో నియోపోలిస్​ లేఅవుట్​లో భూములకు భారీగా ధర పలికే అవకాశం ఉందని అంటున్నారు. ఈ ప్రాంతం నుంచి ఎయిర్ పోర్టుకు వేగంగా చేరుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఆయా భూములపై దేశ-విదేశీ కంపెనీలు కన్నేసినట్టు తెలుస్తోంది.  భూముల వేలంలో పాల్గొనేవారు ప్రతి ప్లాటుకు కనీస ధరావతు రూ.5 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది.

ALSO READ: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై ఇద్దరి కంటే ఎక్కువున్నా

వేలంలో భూమి దక్కించుకుంటే వారం రోజుల్లో అమ్మకం విలువలో రూ.25 చెల్లించాలి. ఆ తర్వాత రెండు నెలల్లో మిగతా సొమ్ము చెల్లిస్తే కొనుగోలుదారుల పేరిట ఆ భూములు రిజిస్టర్‌ చేయనుంది హెచ్‌ఎండీఏ. ఈనెల 17న రాయదుర్గంలో ప్రీబిడ్ సమావేశం నిర్వహించనుంది. ఆయా భూములకు నవంబర్ 24 నుంచి ఈ-వేలం ప్రక్రియ మొదలుకానుంది. డిసెంబరు ఐదున వేలం నిర్వహించనుంది హెచ్ఎండీఏ.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×