E-Paper
Advertisement

GHMC: జీహెచ్ఎంసీ 60 సర్కిళ్లకు డిప్యూటీ కమిషనర్లు నియామకం

GHMC: జీహెచ్ఎంసీ 60 సర్కిళ్లకు డిప్యూటీ కమిషనర్లు నియామకం
Advertisement

GHMC: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిని ప్రభుత్వం పెంచింది. ప్రస్తుతం ఉన్న 6 జోన్లు, 30 సర్కిళ్లను.. 12 జోన్లు, 60 సర్కిళ్లకు పెంచిన విషయం తెలిసిందే. తాజాగా జీహెచ్‌ఎంసీలోని 60 సర్కిళ్లకు ప్రభుత్వం డిప్యూటీ కమిషనర్లను నియమించింది. డివిజన్ల పునర్‌ వ్యవస్థీకరణకు అనుగుణంగా డిప్యూటీ కమిషనర్లను నియమించింది. జీహెచ్ఎంసీ జోన్లు, సర్కిళ్ల పెంపు ప్రక్రియను పూర్తి చేస్తూ.. డివిజన్ల పేర్లతో ప్రభుత్వం ఇప్పటికే జీవో జారీ చేసింది. కొత్త జోన్లకు జోనల్‌ కమిషనర్లులను కూడా నియమించింది. తాజాగా సర్కిళ్లకు డీసీలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

జీహెచ్ఎంసీ పరిధి పెంపు

హైదరాబాద్ మెట్రోపాలిటన్ నగరంగా తన పరిధిని పెంచుకొంటూ పోతుంది. నగర విస్తీర్ణం, జనాభాను దృష్టిలో ఉంచుకుని పాత సర్కిళ్లను ప్రభుత్వం సవరించింది. క్షేత్రస్థాయిలో పాలనపరమైన సౌలభ్యం కోసం మార్పులు చేపట్టింది. 27 పట్టణ స్థానిక సంస్థలను జీహెచ్ఎంసీలో విలీనం చేసింది. దీంతో బృహత్ నగరం అధికార పరిధి 650 చదరపు కిలోమీటర్ల నుండి 2,053 చదరపు కిలోమీటర్లకు పెరిగింది. జీహెచ్ఎంసీ పరిధిలోకి 1.34 కోట్లకు పైగా జనాభా వచ్చి చేసింది. దీంతో దేశంలోని అతిపెద్ద మునిసిపల్ కార్పొరేషన్లలో జీహెచ్ఎంసీ ఒకటిగా మారింది.

Advertisement

GHMCని 6 జోన్‌లు, 30 సర్కిళ్ల నుంచి 12 జోన్‌లు 60 సర్కిళ్లుగా పునర్ వ్యవస్థీకరించారు. వికేంద్రీకరణ, పట్టణ పాలనను బలోపేతం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో క్షేత్రస్థాయి పర్యవేక్షణ, పౌర సేవలు పెరగనున్నాయి.

Also Read: Telangana Politics: మహబూబాబాద్‌లో హైటెన్షన్! ఒకే రోజు ఇద్దరు నాయకుల రాకతో హీటెక్కిన రాజకీయం

Tags

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×