E-Paper
Advertisement

Hyderabad Crime: BMW కారు బీభత్సం.. స్పాట్ లో వ్యక్తి మృతి

Hyderabad Crime: BMW కారు బీభత్సం.. స్పాట్ లో వ్యక్తి మృతి
Advertisement

Hyderabad Crime: హైదరాబాద్‌లో BMW కారు బీభత్సం సృష్టించింది. ఎల్బీనగర్ చింతలకుంట దగ్గర ఈ ఘటన జరిగింది. అతివేగంతో వచ్చిన BMW కారు.. వేగనార్‌ని వెనకాల నుంచి బలంగా ఢీకొట్టింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న మహేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

AP 27 BP 3333 నంబర్ గల BMW కారు హయత్ నగర్ నుంచి ఎల్బీ నగర్ వచ్చే క్రమంలో నందన్ అనే వ్యక్తి అతివేగంగా వెహికల్ డ్రైవ్ చేసినట్టు చెప్తున్నారు. BMW కారులో అన్ని సేఫ్టీ బెలూన్లు తెరుచుకోవడంతో అందులోని వారు ప్రాణాలతో బయటపడ్డారు. ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. ముందు వెళ్తున్న వేగనార్‌లోని వ్యక్తి మాత్రం ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు నల్గొండ జిల్లా మునుగోడు మండలం ఊకోండి గ్రామానికి చెందిన మల్లేష్ గా గుర్తించారు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ నందన్.. విజయవాడ నుంచి హబ్సిగూడకు వెళ్తున్నాడని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×