E-Paper
Advertisement

Honeytrap Apps: ఈ అమ్మాయిలు నిజం కాదు.. రాత్రివేళ జాగ్రత్త!

Honeytrap Apps: ఈ అమ్మాయిలు నిజం కాదు.. రాత్రివేళ జాగ్రత్త!
Advertisement

Honeytrap Apps: సోషల్ మీడియాలో యువతను లక్ష్యంగా చేసుకుని సాగుతున్న హనీట్రాప్, సెక్స్‌టార్షన్ మోసాలపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ హెచ్చరికలు జారీ చేశారు. “ఒంటరిగా ఉన్నారా? అందమైన అమ్మాయిలతో సరదాగా మాట్లాడండి” అంటూ ఇన్ స్టాగ్రామ్, ఫేస్‌బుక్, యూట్యూబ్ వంటి వేదికల్లో వచ్చే ప్రకటనల వెనుక భారీ సైబర్ కుట్ర దాగి ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈ తీయటి మాటల వెనుక ఉన్నది అందమైన వ్యక్తులు కాదు.. మీ డబ్బును, పరువును నిలువునా దోచేసే సైబర్ కేటుగాళ్ల ఉచ్చు అని విశ్లేషించారు.

నేరగాళ్లు యువత ఒంటరితనాన్ని ఆసరాగా చేసుకుని ఏఐ (AI) సాంకేతికతతో సృష్టించిన నకిలీ వీడియోలను వాడుతున్నారని సీపీ వెల్లడించారు. ఈ ప్రకటనల్లో కనిపించే ఆకర్షణీయమైన అమ్మాయిలు నిజం కాదని.. అవన్నీ కృత్రిమ మేధస్సుతో రూపొందించినవని గుర్తించాలని కోరారు. ఆకర్షణీయమైన లింక్ ద్వారా అపరిచిత డేటింగ్ లేదా వీడియో కాలింగ్ యాప్‌లను ఇన్‌స్టాల్ చేసుకుంటే.. క్షణాల్లో మీ ఫోన్‌లోని కాంటాక్ట్స్, గ్యాలరీ సమాచారం మొత్తం నేరగాళ్ల హస్తగతమవుతుందని హెచ్చరించారు. ముఖ్యంగా రాత్రి వేళల్లోనే ఇటువంటి యాడ్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Advertisement

ఈ మోసగాళ్ల అసలు వ్యూహం వీడియో కాల్స్‌తో మొదలవుతుందని సజ్జనార్ వివరించారు. బాధితులు వీడియో కాల్ చేయగానే.. అవతలి వైపు న్యూడ్ వీడియోలను ప్లే చేస్తూ.. స్క్రీన్‌పై ఉన్న బాధితుడి ముఖాన్ని రికార్డ్ చేస్తారు. ఆ తర్వాత ఆ దృశ్యాలను మార్ఫింగ్ చేసి.. బాధితుడి ఫోన్ లోని బంధుమిత్రులకు పంపిస్తామంటూ బ్లాక్‌మెయిలింగ్‌కు దిగుతారు. పరువు పోతుందన్న భయంతో వారు అడిగినంత ఇచ్చుకుంటూ పోతే.. బ్యాంక్ ఖాతాలు ఖాళీ అవ్వడం ఖాయమని ఆవేదన వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమాల్లో ఇటువంటి మోసపూరిత ప్రకటనలు ఇచ్చే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఆన్‌లైన్‌లో ఎవరూ ఊరికే స్నేహితులు కారు అన్న నిజాన్ని గ్రహించాలని.. క్షణికావేశంలో గుర్తుతెలియని యాప్స్ ఇన్‌స్టాల్ చేసుకుని జీవితాలను నాశనం చేసుకోవద్దని సీపీ హితవు పలికారు. ఒకవేళ ఇప్పటికే ఎవరైనా ఇటువంటి సైబర్ వలలో చిక్కుకుంటే.. పరువు పోతుందేమో అని భయపడి మౌనంగా ఉండవద్దని కోరారు. తక్షణమే 1930 టోల్ ఫ్రీ నెంబర్‌కు కాల్ చేయాలని లేదా cybercrime.gov.in పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు. సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా ఉండటమే అత్యంత కీలకమని.. ‘బీ అలర్ట్’ అంటూ సందేశమిచ్చారు.

Advertisement

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×