E-Paper
Advertisement

రీల్స్ మాయలో పడి భవిష్యత్తును పాడు చేసుకోవద్దు.. తల్లిదండ్రులకు వీసీ సజ్జనార్ హెచ్చరిక

రీల్స్ మాయలో పడి భవిష్యత్తును పాడు చేసుకోవద్దు.. తల్లిదండ్రులకు వీసీ సజ్జనార్ హెచ్చరిక
Advertisement

వేసవి సెలవుల నేపథ్యంలో పిల్లల పట్ల తల్లిదండ్రులు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ సూచించారు. ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా స్మార్ట్ ఫోన్ల వినియోగం మితిమీరిపోవడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. డిజిటల్ పరికరాలకు బానిసలుగా మారడం వల్ల చిన్నారుల భవిష్యత్తు అంధకారంలో పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. తల్లిదండ్రులు తమ పని ఒత్తిడిలో ఉండి పిల్లలను పట్టించుకోకపోవడం వల్లే వారు స్మార్ట్ ఫోన్ల మాయలో చిక్కుకుంటున్నారని ఆయన అభిప్రాయపడ్డారు.

ఒకప్పుడు వేసవి కాలం అంటే అమ్మమ్మ తాతయ్యల ఊళ్లకు వెళ్లడం.. చెరువు గట్ల మీద ఆడుకోవడం.. మైదానాల్లో స్నేహితులతో గడపడం వంటి మధుర జ్ఞాపకాలు ఉండేవని సీపీ గుర్తు చేశారు. నేడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయిందని.. బాల్యం కేవలం ఐదు అంగుళాల మొబైల్ తెరకే పరిమితమైపోవడం విచారకరమని అన్నారు. పిల్లలు మైదానాల్లో ఆడుకోవాల్సిన సమయాన్ని ఫోన్లలో రీల్స్ చూడటానికి వెచ్చిస్తున్నారని.. ఇది వారి శారీరక మానసిక ఎదుగుదలపై తీవ్ర ప్రభావం చూపుతుందని స్పష్టం చేశారు.

Advertisement

సోషల్ మీడియాలో అపరిచితుల ఉచ్చులో చిక్కుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తల్లిదండ్రులను సీపీ హెచ్చరించారు. సైబర్ నేరగాళ్లు లేదా అపరిచిత వ్యక్తులు పిల్లల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని వారిని తప్పుదోవ పట్టించే ప్రమాదం ఉందని తెలిపారు. రీల్స్ వంటి సోషల్ మీడియా వ్యసనాలకు బానిసలై నిద్రాహారాలు మాని ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నపాటి మందలింపులకే మనస్తాపం చెంది ఇల్లు వదిలి వెళ్లిపోతున్న సంఘటనలు నగరంలో ఇటీవల పెరుగుతున్నాయని.. ఇవి కుటుంబాల్లో తీరని వేదన మిగిలిస్తున్నాయని పేర్కొన్నారు.

ఈ వేసవిలో పిల్లలకు ఖరీదైన గ్యాడ్జెట్లు కొనివ్వడం కంటే వారితో గడపడం గొప్ప కానుక అని సీపీ సూచించారు. పిల్లలు ఇంటర్‌నెట్‌లో ఏయే వెబ్‌సైట్లు చూస్తున్నారు.. ఎవరితో చాటింగ్ చేస్తున్నారనే విషయాలపై నిరంతరం నిఘా ఉంచాలని కోరారు. ముఖ్యంగా పరీక్షల ఫలితాలు వచ్చే సమయంలో విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురవుతుంటారని.. అటువంటి సమయంలో వారికి మనోధైర్యాన్ని కల్పించి సరైన దిశానిర్దేశం చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులపైనే ఉందని చెప్పారు.

Advertisement

పిల్లల్లో పెరుగుతున్న డిజిటల్ ఒంటరితనాన్ని తొలగించడానికి కుటుంబ సభ్యులందరూ కలిసి సమయాన్ని గడపాలని సీపీ పిలుపునిచ్చారు. వారి ప్రతి కదలికను గమనిస్తూ.. విలువలపై అవగాహన కల్పించాలని కోరారు. తల్లిదండ్రుల అప్రమత్తత మాత్రమే బిడ్డల ఉజ్వల భవిష్యత్తుకు శ్రీరామరక్షగా నిలుస్తుందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.

ALSO READ: PM Modi: చారిత్రక బిల్లుకు అందరూ ఏకం కావాలి.. మహిళా రిజర్వేషన్లపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×