E-Paper
Advertisement

GHMC News: గ్రేటర్ హైదరాబాద్ సిటీవాసులకు అలర్ట్.. 36 గంటలపాటు వాటర్ సరఫరా బంద్

GHMC News: గ్రేటర్ హైదరాబాద్ సిటీవాసులకు అలర్ట్.. 36 గంటలపాటు వాటర్ సరఫరా బంద్
Advertisement

GHMC News: గ్రేటర్ హైదరాబాద్ వాసులను అలర్ట్ చేసింది జలమండలి. సిటీకి సరఫరా చేసే కృష్ణా డ్రింకింగ్ వాటర్ సప్లై పథకం ఫేజ్-2లో మరమ్మత్తు పనులు చేస్తున్నట్లు తెలిపింది. దీని కారణంగా 36 గంటలపాటు నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది.  ఈనెల 10 తేదీ అనగా శనివారం ఉదయం ఆరుగంటల నుంచి ఆదివారం సాయంత్రం ఆరుగంటల వరకు అంతరాయం ఉంటుందని తెలిపింది.

గ్రేటర్ హైదరాబాద్ సిటీవాసులకు అలర్ట్

Advertisement

హైదరాబాద్ నగరానికి సరఫరా చేసే కృష్ణా డ్రింకింగ్ వాటర్ సప్లై పథకం ఫేజ్-2 ఏర్పడిన లీకేజీపై దృష్టి సారించింది హైదరాబాద్ జలమండలి. ముఖ్యంగా కోదండాపూర్ నుంచి గొడకండ్ల వరకు పంపింగ్ మెయిన్‌పై 200 మిమీ డయా ఎంఎస్‌పై లీకేజీ ఏర్పడింది. అంతేకాదు దెబ్బతిన్న 2375 మిమీ డయా ఎంఎస్ ఎయిర్ టీలు, వాల్వ్‌లకు సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. నాసర్ల పల్లి వద్ద జంక్షన్ వద్ద పనులు చేపట్టారు. వివిధ ప్రాంతాల్లో దెబ్బతిన్న బటర్‌ఫ్లై వాల్వ్‌లు, ఎన్‌ఆర్‌వీ-NRVలను మార్పిడి పనులు చేపట్టాల్సి ఉందని జలమండలి వెల్లడించింది.

Advertisement

పనుల నేపథ్యంలో జనవరి 10 అనగా శనివారం ఉదయం 6 గంటల నుంచి మరుసటి రోజు ఆదివారం సాయంత్రం 6 గంటల వరకు నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. నీటి సరఫరాలో అంతరాయం నేపథ్యంలో పలు ప్రాంతావినియోగదారులు నీటి వాడకంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచన చేశారు. నీటి అంతరాయం ఏర్పడే డివిజన్ల పరిధిలోని ప్రాంతాలు ఈ విధంగా ఉన్నాయి.

36 గంటలపాటు వాటర్ సరఫరా బంద్

1. ఓ&ఎం డివిజన్–XI: వనస్థలిపురం, ఆటోనగర్

2. ఓ & ఎం డివిజన్–XIX: ఆటోనగర్ పరిధిలోని ప్రాంతాలు

3. ఓ & ఎం డివిజన్–X: వైశాలీనగర్, నాగోల్

4. ఓ & ఎం డివిజన్–XX: బడంగ్‌పేట్, లెనిన్‌నగర్, ఆదిభట్ల, కమ్మగూడ సమీపంలోని ప్రాంతాలు

5. ఓ & ఎం డివిజన్–VIII: బాలాపూర్ రిజర్వాయర్, బర్కాస్, మైసారం పరిధిలోని ప్రాంతాలు

6. ఓ & ఎం డివిజన్–XIV: యెల్లుగుట్ట రిజర్వాయర్, నాచారం

7. ఓ & ఎం డివిజన్–VII: తార్నాక, బౌద్ధనగర్, నల్లగుట్ట, లాలాపేట, మర్రెడ్‌పల్లి, ప్రకాష్‌నగర్, పాటిగడ్డ, మేకలమండి, మహేంద్ర హిల్స్ రిజర్వాయర్

8. ఓ & ఎం డివిజన్–V: మేకలమండి రిజర్వాయర్ పరిధిలోని ప్రాంతాలు

9. టి.డి–III: ఎంఈఎస్, రైల్వేలు మరియు సికింద్రాబాద్ కాంటోన్మెంట్ బోర్డు

10. ఓ & ఎం డివిజన్–IX: హష్మత్‌పేట్, గౌతమ్‌నగర్, ఫిరోజ్‌గూడ

11. ఓ & ఎం డివిజన్–XVI: మధుబన్ రిజర్వాయర్, శాస్త్రిపురం, ప్రశాసన్‌నగర్

12. ఓ & ఎం డివిజన్–I: నేషనల్ పోలీస్ అకాడమీ

ALSO READ:  వేల కోట్ల భూదందా..  నకిలీ పత్రాలతో ప్రభుత్వ భూమికి ఎసరు

ఈ క్రమంలో పైన పేర్కొన్న ప్రాంతాల వాసులు నీటిని పొదుపుగా వినియోగించుకోగలరని హైదరాబాద్ జలమండలి ఒక ప్రకటనలో తెలిపింది.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×