E-Paper
Advertisement

మృగాల కంటే ఘోరం.. ప్రాణం తీస్తున్న ‘బ్లడ్’ మాఫియా గుట్టురట్టు

మృగాల కంటే ఘోరం.. ప్రాణం తీస్తున్న ‘బ్లడ్’ మాఫియా గుట్టురట్టు
Advertisement

Blood Mafia: హైదరాబాద్‌లోని షేక్‌పేట ప్రాంతంలో వెలుగుచూసిన ‘బ్లడ్ మాఫియా’ ఉదంతం నిజంగా సభ్య సమాజం తలదించుకునేలా ఉంది. ప్రాణాలను కాపాడాల్సిన వైద్య వృత్తిలో ఉండి, నోరు లేని జీవాల రక్తంతో వ్యాపారం చేయడం అత్యంత అమానుషం. ఒక ప్రైవేట్ యానిమల్ హాస్పిటల్ కేంద్రంగా ఈ దందా జరుగుతుంది.

అక్రమ దందా సాగుతోంది ఇలా..

Advertisement

స్థానిక ఆసుపత్రి సిబ్బంది వీధి కుక్కలను సంరక్షిస్తున్నామనే ముసుగులో వాటిని తెచ్చి బంధిస్తున్నారు. చికిత్స కోసం వచ్చే పెంపుడు కుక్కల యజమానులే వీరి ప్రధాన లక్ష్యం. మీ కుక్కకు తీవ్ర రక్తహీనత ఉందని, వెంటనే రక్తం ఎక్కించకపోతే చనిపోతుందని తప్పుడు నివేదికలతో యజమానులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఒక్కో బ్లడ్ ప్యాకెట్‌ను రూ. 18 వేల నుంచి రూ. 25వేల వరకు విక్రయిస్తూ భారీగా సొమ్ము చేసుకుంటున్నారు.

మూగజీవాల బలి..

Advertisement

నిజానికి అవసరం లేకపోయినా పెంపుడు కుక్కలకు రక్తం ఎక్కించడం ఒక ఎత్తైతే, ఆ రక్తం కోసం వీధి కుక్కలను హింసించడం మరో ఎత్తు. బంధించిన వీధి కుక్కల శరీరం నుండి విచక్షణారహితంగా రక్తాన్ని పీల్చేస్తుండటంతో, అవి రక్తహీనతకు గురై ప్రాణాలు వదులుతున్నాయి. ఆరోగ్యంగా ఉన్న మూగజీవాలను కేవలం డబ్బు కోసం బలిపశువులను చేయడం దారుణం.

జంతు ప్రేమికులు ఈ దందాను పసిగట్టి ఆధారాలతో సహా జీహెచ్‌ఎంసీ (GHMC) అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం బయటపడింది. డబ్బు కోసం ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఇలాంటి ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పెంపుడు జంతువుల యజమానులు కూడా ఇలాంటి మోసపూరిత నివేదికల పట్ల అప్రమత్తంగా ఉండాలి.

Also Read: మనుషులా.. మృగాలా? ఆ తల్లి పడుతున్న నరకం చూస్తే మీ కళ్లు చెమర్చాల్సిందే!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×