E-Paper
Advertisement

Hyderabad Hospital Fraud: డాక్టర్లకే వెన్నుపోటు.. నష్టాల పేరుతో కోట్లు స్వాహా! సీసీఎస్ చేతికి చిక్కిన కిలాడీ ఎండీ

Hyderabad Hospital Fraud: డాక్టర్లకే వెన్నుపోటు.. నష్టాల పేరుతో కోట్లు స్వాహా! సీసీఎస్ చేతికి చిక్కిన కిలాడీ ఎండీ
Advertisement

Hyderabad Hospital Fraud: హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో గల ఒక ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రిలో భారీ పెట్టుబడుల మోసం వెలుగులోకి వచ్చింది. ఆసుపత్రి ఈక్విటీ పేరుతో తోటి వైద్యుల నుంచి కోట్లాది రూపాయల నిధులను సేకరించి, ఆపై వంచన చేసినట్లు ఆరోపిస్తూ ఆసుపత్రి మాజీ ఎండీ వేణుగోపాల్ కాకుంట్ల, అతని సోదరుడు హేమంత్ కాకుంట్లపై సీసీఎస్ (CCS) పోలీసులు కేసు నమోదు చేశారు.

ప్లాస్టిక్ సర్జన్ డా. చొక్కా రాజేష్ వాసుతో పాటు మరో 13 మంది సీనియర్ డాక్టర్లు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. 2014-15 మధ్య కాలంలో నిందితులు ఆసుపత్రి విస్తరణ, ఈక్విటీ వాటాల పేరుతో వారిని నమ్మించారు. పారదర్శకమైన, వైద్యుల నియంత్రణలో ఉండే ఆసుపత్రిని నిర్మిస్తామని హామీ ఇచ్చి సుమారు ₹100 కోట్ల వరకు నిధులను సమీకరించారు. ఇందులో ఫిర్యాదు చేసిన 14 మంది డాక్టర్ల వాటానే ₹38 కోట్లకు పైగా ఉంది.

Advertisement

ఆసుపత్రిలో రోగుల సంఖ్య రికార్డు స్థాయిలో ఉన్నప్పటికీ, ఏటా ₹10 నుండి ₹20 కోట్ల వరకు నష్టాలు వస్తున్నట్లు కృత్రిమ లెక్కలు చూపి బాధితులను తప్పుదోవ పట్టించారు. ఆసుపత్రికి వచ్చిన ఆదాయాన్ని నిందితులు తమ సొంత రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు మరియు పెద్ద ఎత్తున బంగారం కొనుగోళ్లకు మళ్లించారని డాక్టర్లు ఆరోపించారు. కరోనా సెకండ్ వేవ్ సమయంలో రోగుల నుంచి ఒక్కొక్కరికి ₹10 నుండి ₹20 లక్షల వరకు భారీ బిల్లులు వసూలు చేశారని, కానీ రికార్డుల్లో మాత్రం తక్కువ మొత్తాలను చూపించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.  ఆసుపత్రికి సమీపంలోని ఒక జ్యువెలరీ షాపు ద్వారా నగదు లావాదేవీలను సాగిస్తూ ఆసుపత్రి రెవెన్యూను తక్కువ చేసి చూపినట్లు బాధితులు వెల్లడించారు.

బాధితుల ఫిర్యాదు మేరకు హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (CCS) పోలీసులు నిందితులు వేణుగోపాల్ మరియు హేమంత్‌లపై IPC సెక్షన్లు 406 (నమ్మకద్రోహం), 409, 477-A (లెక్కల తారుమారు), 120-B (నేరపూరిత కుట్ర) కింద కేసులు నమోదు చేశారు. ఈ కుంభకోణంపై లోతైన దర్యాప్తు జరుపుతున్నామని, త్వరలోనే మరిన్ని ఆధారాలు సేకరించి తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.

Advertisement

Read Also: ఎమ్మెల్యేల అనర్హత వేటుపై స్పీకర్ కీలక తీర్పు!

 

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×