E-Paper
Advertisement

హైదరాబాద్‌లో హెచ్ ఫాస్ట్ దాడులు.. 7 టన్నుల మామిడి పండ్లు స్వాధీనం

హైదరాబాద్‌లో హెచ్ ఫాస్ట్ దాడులు.. 7 టన్నుల మామిడి పండ్లు స్వాధీనం
Advertisement

హైదరాబాద్‌లోని ఆసిఫ్‌నగర్ ప్రాంతంలో నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న నకిలీ పండ్ల దందా బట్టబయలైంది. కృత్రిమ పద్ధతుల్లో పండ్లను మక్కబెడుతున్నారనే పక్కా సమాచారంతో హెచ్ ఫాస్ట్ (H-FAST) అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో భారీ ఎత్తున రసాయనాలు ఉపయోగించి పండించిన మామిడి పండ్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ లాభార్జనే ధ్యేయంగా నడుస్తున్న ఈ గోదాంను అధికారులు సీజ్ చేశారు.

ఆసిఫ్‌నగర్ పరిధిలోని ఒక రహస్య గోదాంలో మామిడి పండ్లను సహజ సిద్ధంగా కాకుండా ప్రమాదకరమైన రసాయనాలతో పండిస్తున్నట్లు అధికారులకు ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన హెచ్ ఫాస్ట్ బృందం గోదాంపై విరుచుకుపడింది. అక్కడ నిల్వ ఉంచిన సుమారు 7 టన్నుల మామిడి పండ్లను చూసి అధికారులు విస్తుపోయారు. పండ్లను త్వరగా పండించేందుకు నిషేధిత మోతాదులో ‘ఇథలీన్’ రసాయనాన్ని వాడుతున్నట్లు తనిఖీల్లో వెల్లడైంది. ఇక్కడ పండించిన పండ్లను నగరం అంతటా సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు.

Advertisement

గోదాంలో మొత్తం 350 ట్రేల మామిడి పండ్లు ఉండగా ప్రతి ట్రేలో సుమారు 20 కేజీల పండ్లు ఉన్నాయి. వీటిని బాటాసింగారం మార్కెట్ నుండి తక్కువ ధరకు కొనుగోలు చేసి తీసుకువచ్చినట్లు విచారణలో తేలింది. మార్కెట్ ధర కంటే ఎక్కువ లాభాలు పొందడానికి పండ్లకు రసాయనాలు పూసి రంగు వచ్చేలా చేస్తున్నారు. ఈ పండ్లు తింటే ప్రజలు తీవ్ర అనారోగ్య సమస్యలకు గురయ్యే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. అక్రమాలకు పాల్పడుతున్న నిర్వాహకులు జమీల్ ఫరీద్‌లపై కఠిన చర్యలు చేపట్టారు.

ప్రస్తుతం ఆ గోదాంను అధికారులు పూర్తిగా సీజ్ చేశారు. పట్టుబడిన పండ్లను స్వాధీనం చేసుకుని ల్యాబ్ పరీక్షలకు పంపించారు. ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించేలా ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడితే సహించేది లేదని అధికారులు స్పష్టం చేశారు. మార్కెట్లలో కొనుగోలు చేసేటప్పుడు పండ్లు సహజ రంగులో ఉన్నాయో లేదో గమనించాలని వినియోగదారులకు సూచించారు. అక్రమ సరఫరాదారుల గొలుసుకట్టును తెంచేందుకు నిరంతరం నిఘా కొనసాగిస్తామని హెచ్ ఫాస్ట్ బృందం ప్రకటించింది.

Advertisement

ALSO READ: పుదుచ్చేరిలో కాంగ్రెస్‌ను గెలిపిస్తే.. తెలంగాణ తరహా సంక్షేమం.. భట్టి విక్రమార్క హామీ

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×