E-Paper
Advertisement

Huzurabad Politics: పాడి కౌశిక్ రెడ్డికి ఝలక్.. తిరగబడ్డ అనుచరులు.. పార్టీ మారేందుకు సన్నద్ధం!

Huzurabad Politics: పాడి కౌశిక్ రెడ్డికి ఝలక్.. తిరగబడ్డ అనుచరులు.. పార్టీ మారేందుకు సన్నద్ధం!
Advertisement

Huzurabad Politics: హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌషిక్ రెడ్డికి బిగ్ షాక్ తగిలే పరిణామాలు కనిపిస్తున్నాయి. కౌశిక్ రెడ్డి వ్యవహార శైలితో విసిగిపోయిన స్థానిక నేతలు, అనుచరులు.. పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఆయనకు వ్యతిరేకంగా ఇప్పటికే హూజూరాబాద్ నియోజక వర్గంలోని 5 మండలాల బీఆర్ఎస్ నేతలు ఏకమైనట్లు సమాచారం. కౌశిక్ రెడ్డి తమపై కక్షగట్టారంటూ పార్టీకి చెందిన సీనియర్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే భవిష్యత్తు కార్యచరణపై చర్చించేందుకు జమ్మికుంటలోని ఓ రిసార్టులో రహస్య సమావేశాన్ని సైతం నిర్వహించినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సైతం బయటకొచ్చాయి.

100 మంది హాజరు..!

కౌశిక్ రెడ్డికి చెక్ పెట్టేందుకు ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో దాదాపు వంద మంది బీఆర్ఎస్ నేతలు, శ్రేణులు పాల్గొన్నట్లు సమాచారం. కౌశిక్ రెడ్డి పోరు తట్టుకోలేక బీఆర్ఎస్ పార్టీని విడిచిపెట్టేందుకు ఈ 5 మండలాల నేతలు ఓ అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు సన్నాహాలు కూడా చేస్తున్నట్లు అంతర్గతంగా సమాచారం అందుతోంది. అయితే కౌశిక్ రెడ్డిపై గుర్రుగా ఉన్న సీనియర్లు ఎవరు అన్న దానిపై క్లారిటీ రావాల్సి ఉంది.

ఏ పార్టీలో చేరతారు?

Advertisement

హుజూరాబాద్ బీఆర్ఎస్ లో చెలరేగిన అసమ్మతి గురించి ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. వారు నిజంగానే పార్టీ మారతారా? ఒక వేళ మారితే ఏ పార్టీలో చేరతారు? అన్న అంశం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. అయితే ఏది ఏమైనా పాడి కౌశిక్ రెడ్డి వ్యవహారం పార్టీలో అసమ్మతిని రాజేస్తోందని ఈ ఘటనతో స్పష్టమైందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఆయన వ్యవహార శైలిలో హుజూరాబాద్ బీఆర్ఎస్ లో చీలికలను ప్రోత్సహిస్తున్నాయంటూ వ్యాఖ్యానిస్తున్నారు.

Also Read: Telangana Budget: బడ్జెట్ అంతా ఓకే గానీ.. పాపం మూడు కార్పొరేషన్ల పరిస్థితే.. అగమ్య గోచరం!

పార్టీకి నష్టం జరుగుతోందనే..

Advertisement

గత కొద్ది రోజులుగా పాడి కౌశిక్ రెడ్డి నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. మేడారంలో పోలీసులతో ఘర్షణ, కరీంనగర్ సీపీపై అనుచిత వ్యాఖ్యలు, గతంలో జగిత్యాల ఎమ్మెల్యేతో వివాదం, గ్రానైట్ క్వారీ యజమానికి బెదిరింపులు ఇలా ఏదొక వివాదంలో ఆయన చర్చకు వస్తూనే ఉన్నారు. నిత్యం వివాదాల్లో మునిగితేలిపోతున్న కౌశిక్ రెడ్డి వ్యవహార శైలిని చూసి హుజూరాబాద్ బీఆర్ఎస్ నేతలు విసిగిపోతున్నారు. ఈ క్రమంలోనే వారిలో సహనం నశించిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కౌశిక్ రెడ్డి వల్ల పార్టీకి పెద్ద ఎత్తున డ్యామేజ్ జరుగుతోందని వారు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ నుంచి కౌశిక్ రెడ్డిని పంపించే పరిస్థితి లేకపోవడంతో.. తామే బీఆర్ఎస్ ను వీడాలన్న నిర్ణయానికి 5 మండలాల నేతలు వచ్చినట్లు పొలికల్ వర్గాలు చెబుతున్నాయి. మెుత్తం మీద ఈ వ్యవహారం ఎలాంటి టర్న్ తీసుకుంటుందో అన్నది ప్రస్తుతం ఆసక్తి రేపుతోంది.

కేసీఆర్ ఏం చేస్తారో?

పాడి కౌశిక్ రెడ్డి నిత్యం వివాదాల్లో ఉన్నప్పటికీ.. ఆయనకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వద్ద మంచి మార్కులే ఉన్నట్లు పార్టీ శ్రేణుల్లో అభిప్రాయాలు ఉన్నాయి. అందుకే తాను ఏది చేసినా చెల్లుబాటు అవుతుందన్న రీతిలో పాడి కౌశిక్ రెడ్డి వ్యవహార శైలి ఉంటోందన్న విమర్శలు సైతం వ్యక్తమవుతున్నాయి. అయితే ఇప్పుడు సొంత పార్టీ నేతలే తిరగబడే స్థాయికి వ్యతిరేకత వెల్లువడుతున్న నేపథ్యంలో.. పార్టీ అధినేత కేసీఆర్ ఎలాంటి చర్యలు తీసుకుంటారన్న చర్చ రాజకీయంగా మెుదలైంది. పాడి కౌశిక్ రెడ్డిపై చర్యలకు ఉపక్రమిస్తారా? లేదా శ్రేణులను బుజ్జగించి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తారా? అన్నది తెలియాల్సి ఉంది.

Also Read: Durandhar 2 Collections : బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న ‘దురంధర్’ కలెక్షన్స్.. రెండో రోజు ఎన్ని కోట్లంటే..?

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×