// // Hyderabad Drug: హైదరాబాద్‌లో డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు.. 12 వేల కోట్ల మాదక ద్రవ్యాలు సీజ్ -->
E-Paper
Advertisement

Hyderabad Drug: హైదరాబాద్‌లో డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు.. 12 వేల కోట్ల మాదక ద్రవ్యాలు సీజ్

Hyderabad Drug: హైదరాబాద్‌లో డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు.. 12 వేల కోట్ల మాదక ద్రవ్యాలు సీజ్
Advertisement

Hyderabad Drug: హైదరాబాద్ నగర శివార్లలో భారీ డ్రగ్స్ తయారీ కేంద్రం గుట్టురట్టయింది. ముంబై క్రైమ్ బ్రాంచ్ అధికారులు మేడ్చల్ లోని ఓ ఫ్యాక్టరీలో సోదాలు నిర్వహించి.. దాదాపు రూ. 12 వేల కోట్ల విలువైన నిషేధిత మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

ముంబై క్రైమ్ బ్రాంచ్ ఆపరేషన్:

మహారాష్ట్ర పోలీసులకు అందిన సమాచారం మేరకు.. ముంబై క్రైమ్ బ్రాంచ్ అధికారులు ఈ ఆపరేషన్ నిర్వహించారు. మేడ్చల్ లో ఉన్న ఒక డ్రగ్స్ కంపెనీలో విస్తృతంగా తయారవుతున్న మూడు రకాల డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో ఎక్స్ టీసీ (XTC), మోలీ, ఎండీఎంఏ (MDMA) వంటి అత్యంత ప్రమాదకరమైన డ్రగ్స్ ఉన్నాయి. ఈ ఆపరేషన్ లో పోలీసులు సుమారు 32 వేల లీటర్ల ముడిసరుకు (రా మెటీరియల్) ను కూడా సీజ్ చేశారు. ఈ డ్రగ్స్ తయారీలో నిమగ్నమైన 13 మందిని అరెస్ట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు.

Advertisement

అంతర్జాతీయ డ్రగ్స్ నెట్ వర్క్:

హైదరాబాద్‌లో తయారైన ఈ డ్రగ్స్ ను దేశంలోనే కాకుండా విదేశాలకు కూడా అక్రమంగా తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ డ్రగ్స్ నెట్వర్క్‌కు సంబంధించి మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఆపరేషన్ దేశంలో డ్రగ్స్ తయారీ, సరఫరాకు సంబంధించి అతి పెద్ద కేసుల్లో ఒకటిగా నిలిచింది.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×