E-Paper
Advertisement

Housing Board Sale: హౌసింగ్ బోర్డు స్థలాలకు మరోసారి భారీ డిమాండ్.. రూ 34.27 కోట్ల ఆదాయం

Housing Board Sale: హౌసింగ్ బోర్డు స్థలాలకు మరోసారి భారీ డిమాండ్.. రూ 34.27 కోట్ల ఆదాయం
Advertisement

Housing Board Sale: నగరంలోని పలు ప్రాంతాల్లో ఉన్న హౌసింగ్ బోర్డు భూములకు మరోసారి అధిక ధరలు పలికాయి. గచ్చిబౌలి ప్రాంతంలో చదరపు గజానికి రూ.1.76 లక్షలకు, కూకట్ పల్లిలో రూ. 1.64 లక్షలకు కొనుగోలు చేశారు. నగరంలోని గచ్చిబౌలి, భౌరంపేట్, బాలాజీ నగర్, చింతల్ తదితర ప్రాంతాల్లోని మొత్తం 14 భూములను బహిరంగ వేలం ద్వారా విక్రయించడానికి ఈనెల 9 వ తేదీన హౌసింగ్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. కెపిహెచ్ బి హోసింగ్ బోర్డు కమ్యూనిటీ హాల్ లో సోమవారం నిర్వహించిన వేలం పాటలో సుమారు 50 మంది బిడ్డర్లు పాల్గొన్నారు.

గచ్చిబౌలిలోని..

విక్రయించిన వాటిలో బౌరంపేట భూమితోపాటు, బాచుపల్లి లో ఒక ఫ్లాట్ మినహా మిగిలినవ్నీ ఎంఐజీ, హెచ్ఐజీ కేటగిరీలోని ప్లాట్లు కావడంతో వీటిని దక్కించుకోడానికి పలువురు పోటీ పడ్డారు. గచ్చిబౌలిలోని 263 చదరపు గజాల విస్తీర్ణంలోని ప్లాట్ కు రూ.50 వేల అప్ సెట్ ప్రైజ్(కనీస ధరగా) నిర్ధారించి వేలం నిర్వహించగా, దీనికి చదరపు గజం రూ.1.76 లక్ష ల ధర పలికింది. అదే విధంగా కూకట్ పల్లి బాలాజీ నగర్ లోని 266 చదరపు గజాల విస్తీర్ణంలోని ప్లాట్ ను వేలం పాటలో రూ.1.64 లక్షలకు కొనుగోలు చేశారు.

Advertisement

Also Read: TG Inter Exams2026: ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం.. రేపటి నుంచి ఎగ్జామ్స్!.. 5 నిమిషాలు ఆలస్యమైనా..!

కనీస ధర రూ.15 లక్షలు

అలాగే చింతల్ ప్రాంతంలోని ఓపెన్ ప్లాట్లకు కూడా మంచి డిమాండ్ తో చదరపు గజం రూ.84 వేలు, రూ.74 వేల ధరలతో అమ్ముడు పోయినట్లు హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ వీపీ గౌతమ్ తెలిపారు. అలాగే నిజాంపేటలోని సిద్ధి ఫ్లాట్ కు కనీస ధర రూ.15 లక్షలుగా నిర్దారించగా దీనిని వేలం పాటలో రూ. 17.70 లక్షలకు కొనుగోలు చేశారు. అలాగే గచ్చిబౌలిలోని మరో ప్లాట్ చదరపు గజం రూ.1 లక్ష పలికింది. కాగా భౌరంపేటలోని 2600 చదరపు గజాల విస్తీర్ణంలోని భూమిని చదరపు గజం రూ.61 వేలకు అమ్ముడు పోయింది. మొత్తంగా సోమవారం నాటి భూముల విక్రయాల ద్వారా రూ.34.27 లక్షల మేర ఆదాయం వచ్చిందని వైస్ చైర్మన్ గౌతమ్ల వివరించారు.

Advertisement

Also Read: Telangana Police: మావోయిస్టుల లొంగుబాటులో తెలంగాణ టాప్​ రిజల్ట్.. దేశంలోనే అగ్రస్థానం!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×