E-Paper
Advertisement

Miryalaguda: మిర్యాలగూడలో ఘోరం.. గ్యాస్ సిలిండర్ పేలుడులో కొత్త విషయాలు, ముగ్గురు సజీవ దహనం

Miryalaguda: మిర్యాలగూడలో ఘోరం..  గ్యాస్ సిలిండర్ పేలుడులో కొత్త విషయాలు,  ముగ్గురు సజీవ దహనం
Advertisement

Miryalaguda: నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. పట్టణంలోని కలలవాడ కాలనీలో గ్యాస్ సిలిండర్ పేలుడు ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలిపోయినట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు సజీవ దహనమయ్యారు. స్థానికంగా తీవ్ర కలకలం రేపిన ఈ ఘటనలో అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన జరిగింది.

మిర్యాలగూడలో ఘోరం.. గ్యాస్ సిలిండర్ పేలుడు

Advertisement

ఇంట్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు ఏర్పడ్డాయి. అవి వేగంగా వ్యాపించడంతో ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి పోయింది. ఆ సమయంలో ఇంటి కుటుంబసభ్యులంతా మంటల్లో చిక్కుకున్నారు. ఈ ప్రమాదంలో 46 ఏళ్ల చంద్రమ్మ, మనవడు, మనవరాలు మంటల్లో చిక్కుకుని సజీవ దహనమయ్యారు.

ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, ఫైర్ ఇంజన్లు రంగంలోకి దిగాయి. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. మృతి చెందిన వారిని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రి‌కి తరలించారు పోలీసులు.

Advertisement

ఇంట్లోని ముగ్గురు సజీవ దహనం.. ఆ ఫ్యామిలీ కష్టాలు అన్నీ ఇన్నీకావు

చంద్రమ్మ భర్త పక్షవాతంతో పదేళ్లుగా మంచానికే పరిమితం అయ్యాడు. పెద్ద కూతురు వివాహం తర్వాత అల్లుడు రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఇద్దరు చిన్న పిల్లలు, కూతురు కలిసి జీవనం సాగిస్తున్నారు. అదే సమయంలో ఆ ఫ్యామిలీపై విధి కన్నెర్ర చేసింది.

చంద్రమ్మ భర్త మరణించి నెల రోజులు గడవకుండానే ఆ ఇంట్లో మరో పెను విషాదం చోటుచేసుకుంది. గ్యాస్ సిలిండర్ ఘటనలో అమ్మమ్మతోపాటు మనవడు, మనమరాలు ఈలోకాన్ని విడిచిపెట్టారు. చివరకు చంద్రమ్మ కూతురు ఉన్నారు. తల్లి, పిల్లల మృతదేహాలను చూసి ఆమె కన్నీరు మున్నీరు అయ్యారు. ఆమెని ఓదార్చడం ఎవరివారి వల్ల కాలేదు.

ALSO READ: రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ స్కామ్.. తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు, కేటీఆర్ ఎలా రియాక్ట్ అవుతారో?

 

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×