E-Paper
Advertisement

Mallareddy: ఆ ఐటీ అధికారిని అరెస్టు చేయొద్దు.. మల్లారెడ్డి కేసులో హైకోర్టు స్టే..

Mallareddy: ఆ ఐటీ అధికారిని అరెస్టు చేయొద్దు.. మల్లారెడ్డి కేసులో హైకోర్టు స్టే..
Advertisement

Mallareddy: మంత్రి మల్లారెడ్డిపై ఐటీ దాడుల కేసు అనేక మలుపులు తిరుగుతోంది. పరస్పర కేసులతో ఉత్కంఠ కొనసాగుతోంది. తనపై మల్లారెడ్డి తనయుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంపై ఐటీ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రత్నాకర్ హైకోర్టును ఆశ్రయించారు. ఆ కేసు తొలగించాలంటూ పిటిషన్ వేశారు. విచారణ అనంతరం కేసునైతే తొలగించలేదు కానీ.. నాలుగు వారాల పాటు ఐటీ అధికారిని అరెస్టు చేయొద్దని ఆదేశించింది. రత్నాకర్ పై నమోదైన కేసు విచారణపై స్టే విధించింది.

అసలేం జరిగిందంటే..
ఐటీ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ రత్నాకర్ పై మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదాయపన్ను దాడులు నకిలీవిగా కనిపిస్తున్నాయని.. అధికారులు దాడి చేయడంతోనే తన సోదరుడు మహేందర్‌రెడ్డి ఆసుపత్రి పాలయ్యారని.. సెర్చ్‌ ప్రొసీడింగ్స్‌పై ఆయనతో బలవంతంగా సంతకాలు తీసుకునేందుకు ప్రయత్నించారని భద్రారెడ్డి పోలీసులకు కంప్లైంట్ చేశారు. స్పందించిన పోలీసులు ఐటీ అధికారి రత్నాకర్‌పై ఐపీసీ 384 (దోపిడీ) సెక్షన్‌ కింద కేసు నమోదు చేశారు. తనపై అక్రమంగా నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ ఐటీ అధికారి రత్నాకర్‌ హైకోర్టులో లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం.. రత్నాకర్‌పై నమోదైన కేసు విచారణపై స్టే విధించింది.

Advertisement

మరోవైపు, మల్లారెడ్డిపై ఐటీ శాఖ సైతం పోలీసులకు పలు ఫిర్యాదులు చేసింది. ప్రభుత్వ ఉద్యోగుల విధులకు ఆటంకం కల్పించడం.. దౌర్జన్యం చేయడం.. ఆధారాలు ధ్వంసం చేయడం.. తదితర ఆరోపణలతో పలు సెక్షన్ల కింద మల్లారెడ్డిపై కేసులు నమోదు చేశారు పోలీసులు. ఇలా, ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకోవడంతో.. ఐటీ దాడుల కేసులో అనేక ట్విస్టులకు దారి తీస్తోంది.

అటు, ల్యాప్ టాప్ వ్యవహారం సైతం మల్లారెడ్డి మెడకు చిక్కుకునేలా ఉంది. ఐటీ అధికారి రత్నకుమార్‌ తన ల్యాప్‌టాప్‌ చోరీ అయిందని, అందులో ఉన్న విలువైన డాటా తొలగించారని… మంత్రి మల్లారెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, అదే రోజు రాత్రి ఆ ల్యాప్‌టాప్‌ను మంత్రి అనుచరులు పోలీసులకు అప్పగించారు. పోలీసులు ల్యాప్‌టాప్‌ స్వాధీనం చేసుకుని ఐటీ అధికారులకు సమాచారం అందించారు. అయితే, ఐటీ అధికారులు మాత్రం ల్యాప్‌టాప్‌ తీసుకునేందుకు రాలేదు. ఆ ల్యాప్ టాప్ తనది కాదన్నారు రత్నాకర్. దీంతో, ల్యాప్‌టాప్‌ ను సీజ్ చేసి బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్లోనే ఉంచారు పోలీసులు.

Advertisement

ఇలా మల్లారెడ్డి వర్సెస్ ఐటీ ఆఫీసర్ రత్నాకర్ ఎపిసోడ్ హాట్ హాట్ గా సాగుతోంది. పరస్పర కేసులతో ఉత్కంఠ నెలకొంది.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×