E-Paper
Advertisement

Big Shock to KCR: కేసీఆర్‌‌కు హైకోర్టు షాక్, మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేం, కాళేశ్వరం రిపోర్టుపై వ్యాఖ్య

Big Shock to KCR: కేసీఆర్‌‌కు హైకోర్టు షాక్, మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేం, కాళేశ్వరం రిపోర్టుపై వ్యాఖ్య
Advertisement

Big Shock to KCR: కాళేశ్వరం ప్రాజెక్టు నివేదికను రద్దు చేయాలంటూ కేసీఆర్ వేసిన పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. కాళేశ్వరం కమిషన్ నివేదికపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని తేల్చేసింది చీఫ్ జస్టిస్ ధర్మాసనం. పూర్తి వివరాలతో మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.

మరోవైపు కమిషన్ నివేదికను అసెంబ్లీలో చర్చించిన తర్వాత చర్యలు తీసుకుంటాని ధర్మాసనానికి చెప్పారు అడ్వకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డి. ఆయన వాదనలతో న్యాయస్థానం ఏకీభవించింది. పిటిషనర్లు ఇద్దరు ఎమ్మెల్యేలని, వారిపై అవినీతి ఆరోపణలు ఉన్నాయని మరో న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదించారు.

Advertisement

కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికపై స్టే ఇవ్వాలంటూ కేసీఆర్, హరీష్‌రావులు హైకోర్టుతో పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై గురువారం, శుక్రవారం రెండు రోజులుగా న్యాయస్థానం విచారణ చేపట్టింది. పిటిషన్ల తరపు సుప్రీంకోర్టు న్యాయవాదులు సుందరం, శేషాద్రినాయుడు వాదించారు. నివేదికకు సంబంధించి సెక్షన్ 8B, 8C కింద నోటీసు ఇవ్వలేదని న్యాయస్థానం దృష్టికి తెచ్చారు.

నివేదికపై అసెంబ్లీలో చర్చ తర్వాత చర్యలు తీసుకుంటారా? లేకుంటే చర్యలు చేపట్టి చర్చ చేస్తారా? అన్నదానిపై సుధీర్ఘం విచారణ సాగింది. తెలంగాణ ప్రభుత్వం తరపున నిర్ణయాన్ని కాపీ రూపంలో ఏజీ సుదర్శన్‌రెడ్డి న్యాయస్థానానికి సమర్పించారు. అసెంబ్లీలో చర్చ జరిగిన తర్వాత ఆయా వివరాలను ప్రజల ముందు పెట్టి కేసీఆర్, హరీష్‌‌రావులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Advertisement

ALSO READ: ఇంజనీరింగ్ ఫీజుల పెంపు.. తెలంగాణ ప్రభుత్వం కొత్త రూల్స్

అసెంబ్లీలో రిపోర్టు ప్రవేశపెట్టడానికి ఆరునెలల సమయం పడుతుందని తెలిపారు. పిటిషన్లు ఇద్దరు సభలో సభ్యులుగా ఉన్నారని, వారిముందే చర్చ పెడతామని తెలిపారు. ఏజీ వాదనలతో న్యాయస్థానం ఏకీభవించింది. కమిషన్ నివేదికను వెబ్సైట్లో అప్లోడ్ చేయడాన్ని తప్పు పట్టింది హైకోర్టు. ఒకవేళ వెబ్‌సైట్‌లో ఉంటే రిపోర్టును వెంటనే తొలగించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

నివేదికను ప్రభుత్వం ఎక్కడా పబ్లిక్‌ డొమైన్‌లో పెట్టలేదని వివరించారు ఏజీ. ఒకవేళ పెడితే వెంటనే తొలగించాలని ఆదేశించింది. ప్రస్తుత పరిస్థితుల్లో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయలేమని తేల్చింది. దీనిపై మూడు వారాల్లో పూర్తి కౌంటర్‌ దాఖలు చేయాలని కేసీఆర్‌, హరీష్‌రావులకు చీఫ్‌ జస్టిస్‌ ధర్మాసనం ఆదేశించింది.

న్యాయస్థానం నుంచి క్లారిటీ రావడంతో అసెంబ్లీలో కాళేశ్వరం రిపోర్టుపై చర్చ పెట్టనుంది ప్రభుత్వం. మొత్తానికి మాజీ సీఎం కేసీఆర్ చుట్టూ ఉచ్చు బిగుసుకున్నట్లయ్యింది.  అసెంబ్లీలో చర్చ జరిగిన తర్వాత రిపోర్టుపై కేబినెట్ నిర్ణయం తీసుకోనున్నారు.  అప్పుడు సిట్ వేస్తుందా? సీబీఐకి అప్పగిస్తుందా? సూత్రధారులు, పాత్రధారులకు శిక్ష పడే విధంగా ముందుకు వెళ్లే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

 

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×