E-Paper
Advertisement

Farm House case: సీఎం కేసీఆర్ పంపిన ఫుటేజ్ పరిశీలిస్తాం.. హైకోర్టు కీలక నిర్ణయం

Farm House case: సీఎం కేసీఆర్ పంపిన ఫుటేజ్ పరిశీలిస్తాం.. హైకోర్టు కీలక నిర్ణయం
Advertisement

Farm House case: ఫాంహౌజ్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు అనేక మలుపులు తిరుగుతోంది. మొయినాబాద్ నుంచి ఢిల్లీ వరకు లింకులు బయటికొచ్చాయి. ఏకంగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎస్ సంతోష్ కే నోటీసులు జారీ అయ్యాయి. అయితే, దూకుడుగా ఉన్న సిట్ కు హైకోర్టు బ్రేకులు వేసింది. సంతోష్, జగ్గుస్వామి, తుషార్ లకు ఇచ్చిన నోటీసులపై స్టే విధించింది. మరోవైపు, కేసును సీబీఐకి అప్పగించాలంటూ నిందితులు నందకుమార్, రామచంద్రభారతి వేసిన పిటిషన్ పైనా హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.

సీఎం కేసీఆర్ తమకు పెన్ డ్రైవ్‌లు, సీడీల రూపంలో ఫాంహౌజ్ వీడియో ఫుటేజీని పంపించారని.. అవి చీఫ్ జస్టిస్‌కు కూడా అందాయని.. ధర్మాసనం తెలిపింది. కేసీఆర్ పంపిన ఆ ఎవిడెన్సులను ఇంకా పరిశీలించలేదని.. విచారణ సందర్భంగా వాటిని పరిగణనలోకి తీసుకుంటామని కోర్టు తెలిపింది. సీఎం కేసీఆర్ పంపిన ఫూటేజ్ చూసిన తర్వాత విచారణ చేపడతామని స్పష్టం చేసింది. సీబీఐ విచారణ కోరుతూ దాఖలైన పిటిషన్లపై తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది హైకోర్టు.

Advertisement

మొయినాబాద్ ఫాంహౌజ్ లో నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో ముగ్గురు మధ్యవర్తులు బేరసారాలు ఆడిన ఉదంతం తెలిసిందే. ఫాంహౌజ్ లో జరిగిన ఆ ఎపిసోడ్ మొత్తాన్ని సీక్రెట్ కెమెరాల్లో బంధించారు. ఆ ఫుటేజ్ ఇప్పుడు కేసు విచారణలో కీలకంగా మారనుంది. అయితే, పోలీసుల దగ్గర మాత్రమే ఉండాల్సిన ఈ వీడియో రికార్డింగ్స్ ను సీఎం కేసీఆర్ మీడియా సమావేశంలో బయటపెట్టడం వివాదాస్పదమైంది. ఆ ఫుటేజ్ ని హైకోర్టు, సుప్రీంకోర్టుతో సహా దేశంలోని అన్ని ప్రతిపక్ష పార్టీలకూ పంపించారు సీఎం కేసీఆర్. అలా నేరుగా న్యాయమూర్తులకు వీడియో రికార్డింగ్స్ పంపించడాన్ని ఓ సందర్భంలో కోర్టు కూడా తప్పుబట్టింది. కానీ, ఇప్పుడు అదే కోర్టు.. సీఎం కేసీఆర్ పంపించిన ఫుటేజ్ ను పరిశీలిస్తామని.. ఆ తర్వాతే విచారణ చేపడతామని నిర్ణయించడం ఆసక్తికర పరిణామం అంటున్నారు.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×