E-Paper
Advertisement

Telangana High Court: తెలంగాణ హైకోర్టులో విషాదం.. కేసు వాదిస్తూ ప్రాణాలు విడిచిన లాయర్

Telangana High Court: తెలంగాణ హైకోర్టులో విషాదం.. కేసు వాదిస్తూ ప్రాణాలు విడిచిన లాయర్
Advertisement

Telangana High Court: ఇటీవల పెళ్లిళ్లలో డ్యాన్స్ చేస్తూ, ఊరేగింపులో వరుడు ఊరేగుతూ, ఇలా వేర్వేరు ఘటనల్లో పలువురు కుప్పకూలి మృతి చెందిన ఘటనలు వరుసగా జరిగాయి. సేమ్ టు సేమ్ అలాంటి ఘటన తెలంగాణలో మంగళవారం జరిగింది. తెలంగాణ హైకోర్టులో ఓ లాయర్.. సీరియస్ గా వాదనలు వినిపిస్తూ, తుదిశ్వాస విడిచారు. ఏకంగా న్యాయస్థానంలోనే ఆయన కుప్పకూలి మృతి చెందడంతో అక్కడ విషాదఛాయలు అలుముకున్నాయి.

న్యాయవాది పసునూరి వేణుగోపాల్.. రోజు వారీ మాదిరిగానే మంగళవారం హైకోర్టుకు వచ్చారు. తన క్లయింట్ తరపున సీరియస్ గా వాదనలు వినిపిస్తున్నారు. అప్పుడే అకస్మాత్తుగా గుండెపోటుకు గురై కుప్పకూలారు. వెంటనే న్యాయమూర్తి ఆదేశాల మేరకు న్యాయవాదులు, ఆయనను వైద్యశాలకు తరలించారు. అంతలోనే వేణుగోపాల్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.  వాదనలు వినిపిస్తూ న్యాయవాది వేణుగోపాల్ కుప్పకూలి, కన్నుమూయగా, తోటి న్యాయవాదులు దిగ్భ్రాంతికి గురయ్యారు. న్యాయవాది మృతికి సంతాపంగా హై కోర్టు లో అన్ని బెంచ్ లలో విచారణలను న్యాయమూర్తులు నిలిపి వేశారు. అన్ని కోర్టులలో విచారణలను రేపటికి వాయిదా వేస్తూ న్యాయమూర్తులు నిర్ణయం తీసుకున్నారు. కాగా వేణుగోపాల్ ఎన్నో కీలకమైన కేసులను వాదించి న్యాయవృత్తిలో పేరు ప్రఖ్యాతులు సాధించారు.

Advertisement

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×