E-Paper
Advertisement

Venkatesh election campaign: ఖమ్మం, కైకలూరులో వెంకీ ప్రచారం, ఎందుకంటే..?

Venkatesh election campaign: ఖమ్మం, కైకలూరులో వెంకీ ప్రచారం, ఎందుకంటే..?
Advertisement

Venkatesh election campaign: తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం కోలాహలంగా మారింది. ఇప్పుడిప్పుడే ఏపీ, తెలంగాణలో నటీనటుల జోష్ కనిపిస్తోంది. ఇప్పటికే హీరో వరుణ్ తేజ్ పిఠాపురంలో బాబాయ్ పవన్‌‌కల్యాణ్ తరపున ప్రచారాన్ని నిర్వహించాడు. ఆ జాబితాలోకి టాలీవుడ్ హీరో వెంకటేష్ చేరనున్నాడు. వెంకటేష్ ఎన్నికల ప్రచారంలోకి దిగబోతున్నాడు.

ఖమ్మం లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్థి బరిలో ఉన్న రఘురామిరెడ్డికి మద్దతుగా ప్రచారం చేయనున్నాడు. మే 7న ఖమ్మం టౌన్‌లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించనున్న రోడ్ షోలో ఆయన పాల్గొనబోతున్నట్లు సమాచారం. రఘురామిరెడ్డికు స్వయానా వియ్యంకుడు వెంకటేష్. పెద్ద కుమార్తె ఆశ్రితకు రాఘురామిరెడ్డి స్వయానా మామ. ఆయన కొడుకు వినాయక్‌రెడ్డిని అల్లుడిగా చేసుకున్నాడు వెంకటేష్. వియ్యంకుడి కోసం ఒకరోజు ప్రచారంలో నిమగ్నం కానున్నాడన్న మాట.

Advertisement

ఇక్కడ ప్రచారం పూర్తి కాగానే పనిలోపనిగా వెంకీ..  కైకలూరు వెళ్లే ఛాన్స్ వుందని ఫిల్మ్‌నగర్ నుంచి బలంగా  వినిపిస్తున్నమాట. కూటమి తరపున బీజేపీ అభ్యర్థిగా కామినేని శ్రీనివాసరావు నామినేషన్ దాఖలు చేశారు. వెంకటేష్ వైఫ్ నీరజకు కామినేని శ్రీనివాసరావు స్వయానా మేనమామ. అందుకోసమే ఆయన తరపున ఈ హీరో ప్రచారం చేయనున్నట్లు సమాచారం. కాకపోతే కైకలూరు ఈ హీరో ప్రచారం చేయడని అంటున్నవాళ్లూ లేకపోలేదు. 2014 కామినేని కైకలూరు నుంచి పోటీ చేసినప్పుడు కూడా వెంకటేష్ ప్రచారం చేయలేదని అంటున్నారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×