E-Paper
Advertisement

Cyclone Montha: ఆ జిల్లాలపై మొంథా తుఫాను ఎఫెక్ట్.. అధికారులకు మంత్రి సీతక్క కీలక ఆదేశాలు

Cyclone Montha: ఆ జిల్లాలపై మొంథా తుఫాను ఎఫెక్ట్.. అధికారులకు మంత్రి సీతక్క కీలక ఆదేశాలు
Advertisement

Cyclone Montha: రాష్ట్రంలో కొనసాగుతున్న మొంథా తుఫాను నేపథ్యంలో తలెత్తే పరిణామాలపై  తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉన్న మహబూబాబాద్, ములుగు జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులతో  పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ శాఖ‌ మంత్రి డాక్ట‌ర్ ద‌న‌స‌రి అన‌సూయ సీత‌క్క‌ టెలికాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు.  అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ, అత్యవసర చర్యలకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.

చలిగాలులు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రైతులు, పశువుల కాపరులు తమ పశువులు, పంటల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.  మత్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని, అలాగే ప్రజలు వాగులు, చెరువులు దాటే ప్రయత్నం చేయరాదని, నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు దూరంగా ఉండాలని సీతక్క కోరారు.

Advertisement

Read Also: Rains In Telangana: మొంథా ఎఫెక్ట్.. తెలంగాణలో భారీ వర్షాలు, అర్థరాత్రి నుంచి హైదరాబాద్‌లో గ్యాప్ ఇచ్చి

పలు చోట్ల రైళ్లు నిలిచిపోయినట్లు సమాచారం అందుతున్న నేపథ్యంలో, ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రయాణికులకు ఆహారం, తాగునీరు వంటి అవసరాలు తీర్చాలని సూచించారు. తుఫాను ప్రభావం తగ్గే వరకు ప్రజలు ప్రభుత్వ ఆదేశాలను పాటించాలని, అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రాకూడదని మంత్రి సీతక్క కోరారు.

Advertisement

మరోవైపు తెలంగాణలో పలు జిల్లాల్లో మొంథా తుఫాన్ ప్రభావం పడిందని ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. తుఫాన్ ప్రభావంతో ఇప్పటికే పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వచ్చే 12 నుంచి 24 గంటల్లో తుఫాన్ తీవ్రత తగ్గనుందని వాతావరణ శాఖ వెల్లడించింది.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×