E-Paper
Advertisement

Weather News: రాబోయే 5 రోజులు జాగ్రత్త.. అసలు బయటకు రావొద్దు.. ఆ 16 జిల్లాలకు ఎల్లో అలెర్ట్..

Weather News: రాబోయే 5 రోజులు జాగ్రత్త.. అసలు బయటకు రావొద్దు.. ఆ 16 జిల్లాలకు ఎల్లో అలెర్ట్..
Advertisement

Weather News: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు భగ్గుమంటున్నాయి. పగటిపూట ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. బయటకి రావాలంటేనే ప్రజలు భయపడిపోతున్నారు. తెలంగాణలో పలు జిల్లాల్లో 44 నుంచి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి.

రాష్ట్ర వ్యాప్తంగా రాబోయే 5 రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.  ఎండల తీవ్రత నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో 16 జిల్లాల్లో 2 నుంచి 3 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరిగే ఛాన్స్ ఉందని అధికారులు తెలిపారు. ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, భూపాలపల్లి, జగిత్యాల, కరీంనగర్, ఖమ్మం, ఆసిఫాబాద్, మంచిర్యాల, మహబూబాబాద్, ములుగు, నల్గొండ, నిర్మల్, పెద్దపల్లి, నిజామాబాద్, సిరిసిల్ల, రంగారెడ్డి, సూర్యాపేట జిల్లాలకు వాతావరణశాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

Advertisement

రాబోయే ఐదు రోజుల పాటు ఈ జిల్లాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్రంలోని మిగిలిన జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఉష్ణోగ్రతల్లో మార్పులు చోటు చేసుకుండడంతో కొన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదు అయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. మరోవైపు వాతావరణ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియని పరిస్థితి కనిపిస్తోంది. ఆకస్మికంగా వాతావరణంలో మార్పులు జరిగి వర్షాలు కురుసే అవకాశం ఉండొచ్చు.

ఉష్ణోగ్రతల మార్పుల వల్ల తెలంగాణ రాష్ట ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని అధికారులు తెలుపుతున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, గర్భిణీ స్త్రీలు బయటకు రావొద్దని సూచిస్తున్నారు.

Advertisement

Also Read: ITDC Jobs: డిగ్రీ పాసయ్యారా..? గుడ్ న్యూస్.. ఐటీడీసీలో ఉద్యోగాలు.. నెలకు రూ.71వేల జీతం

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×