E-Paper
Advertisement

Big Alert: తెలంగాణ వాసులకు అలర్ట్.. రానున్న 3 గంటల్లో ?

Big Alert: తెలంగాణ వాసులకు అలర్ట్.. రానున్న 3 గంటల్లో ?
Advertisement

Big Rain Alert to Telangana Districts : తెలంగాణ వాసులకు వాతావరణశాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న 3 గంటల్లో రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించింది. చెట్లకింద, పొలాల్లో ఎవరూ ఉండవద్దని హెచ్చరించింది.

ఆదిలాబాద్, భూపాలపల్లి, కరీంనగర్, నిజామాబాద్, పెద్దపల్లి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు భారీ వర్షసూచన చేసింది. ఆయా జిల్లాల్లో పిల్లలు, పెద్దలంతా ఇళ్లకు చేరుకోవాలని తెలిపింది. అలాగే హైదరాబాద్ తో పాటు భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, జనగాం, కామారెడ్డి, కొమరం భీమ్, మంచిర్యాల, మెదక్, మల్కాజ్ గిరి, ములుగు, నిర్మల్, సిరిసిల్ల, రంగారెడ్డి, సిద్ధిపేట, వరంగల్, హనుమకొండ, భువనగిరి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.

ఆంధ్రప్రదేశ్ లో ఇలా..
Advertisement

కాగా.. ఏపీకి మరో రెండురోజులు వర్షసూచన ఉన్నట్లు వాతావరణ విభాగం వెల్లడించింది. బంగాళాఖాతంలో వేర్వేరు ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనాల కారణంగా రేపు, ఎల్లుండి దక్షిణ కోస్తా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీస్తాయని పేర్కొంది. అలాగే రాయలసీమలోని పలు జిల్లాల్లో ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×